సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టపడి వస్తారు. ప్రేక్షకులందరూ వారిని గుర్తించి స్థాయికి వారు వస్తేనే వారి కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. అసలు విషయంలోకి వెళితే బిగ్ బాస్ షో లో అందరినీ అలరించిన హరితేజ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం సినిమాలలో కనిపిస్తూ మనందరినీ అలరిస్తున్న అప్పటికీ హరితేజ వచ్చింది మాత్రం సీరియల్ తోనే. హరితేజ ఆమెకు పదహారేళ్లు ఉన్నప్పటినుండే సీరియల్స్ చేయడం మొదలు పెట్టింది. మొదట్లో ఈమె నటించిన సీరియల్ పెద్దగా ఆదరణ పొందలేదు. అయితే ఆమె ముందుగా డైరెక్టర్ తో రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం అక్కడే చేయాలి వేరే సీరియల్ లో చేయడానికి వీలులేదు ఇక దీనితో హరితేజ అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

 రెండేళ్లపాటు అలానే ఇబ్బందులు పడుతూ సీరియల్ చేసింది దాని తరువాత సింగర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది హరితేజ. అయితే ఈ క్రమంలోనే తనకో సింగర్ తో ప్రేమలో పడింది హరితేజ అనంతరం వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకుందట. దాని అనంతరం వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.ఇకపోతే మరికొద్ది రోజుల్లోనే ఆమె పెళ్లి జరుగుతుంది అనుకున్న సమయంలో పెళ్లి కుమారుడి ఇంట్లో వాళ్ళు పేచీ పెట్టడం అంతేకాకుండా , అతను కూడా వాళ్ళ మాటలకే వంత పాడడంతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో ఈ ఎదురు దెబ్బ తగలడంతో చాలా కృంగిపోయింది హరితేజ.

అయితే దీని అనంతరం  చాలా కాలం తర్వాత దీపక్ అనే వ్యక్తితో ఆమె వివాహం జరిగింది. దాని తరువాత ఆయన సపోర్టుతో మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హరితేజ.ఇక దాని తరువాత  టాలీవుడ్ లో కూడా అవకాశాలు రావడం, దానితో పాటు దర్శకుడు త్రివిక్రమ్ అఆ లో మంచి ఛాన్స్ ఇవ్వడంతో ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇకపోతే ఆమెకు కెరియర్లో తగిన దెబ్బల కంటే నిజజీవితంలో తాకిన దెబ్బలే ఎక్కువగా గాయపరిచాయన్న హరితేజ తనని మోసం చేసిన వాళ్ళేవరు బాగు పడలేదని వెల్లడించింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: