టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో లలో ఒకరు ఆయన కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ స్పీడ్ ను చూపిస్తున్నాడు. రాజావారు రాణి గారు మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ని సంపాదించు కున్నాడు. 

ఆ తర్వాత సెబాస్టియన్ మూవీ లో కానిస్టేబుల్ పాత్రలో నటించిన కిరణ్ అబ్బవరం ఈ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్నాడు . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం కిరణ్ అబ్బవరం వరుస మూవీ లలో నటిస్తున్నాడు . అందులో భాగంగా కిరణ్ అబ్బవరం ప్రస్తుతం సమ్మతమే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు . ఈ మూవీ లో కిరణ్ అబ్బవరం సరసన చాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది . ఈ మూవీ ని జూలై 24 వ తేదీన విడుదల చేయబోతున్నారు . ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ ను వేగ వంతం చేయబోతోంది . అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన విడుదల తేదీని తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.

సమ్మతమే సినిమా ట్రైలర్ ను జూన్ 16 వ తేదీన సాయంత్రం 4.05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. సమ్మతమే మూవీ కి గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా శేఖర్ చంద్రమూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ తో కిరణ్ అబ్బవరం ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: