టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ బ్యాక్ గ్రౌండ్ తో కాకుండా స్వశక్తితో ఎంట్రీ ఇచ్చి నిలదొక్కుతున్న హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్పాలి . అలాంటి హీరోలలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. చిన్న చిన్న పాత్రలు చేసిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో రేస్ లోకి వచ్చాడు. గీత గోవిందం సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు అని చెప్పాలి. ఇక ఎప్పుడు స్టార్ హీరోల సినిమాలకు ఎక్కడ తక్కువ కాకుండా తన సినిమాలను తీస్తూ ఉన్నాడు. స్టార్ హీరోలతో పోల్చి చూస్తే తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా వచ్చిన లైగర్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చి ఫెయిల్యూర్ గానే మిగిలిపోయింది. దీంతో ఎంతగానో నిరాశ చెందినా విజయ్ దేవరకొండ ఇక ఇప్పుడు నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టాడు అనేది తెలుస్తుంది. మరోసారి పూరీ డైరెక్షన్లోనే జనగణమన సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. ఇక ప్రస్తుతం జై జవాన్ అనే కార్యక్రమం చేస్తున్న విజయ్ దేవరకొండ పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.


 ఈ క్రమంలోనే తన డ్రీమ్ రోల్ ఏమిటి అన్న విషయాన్ని మనసులో మాట బయటపెట్టేసాడు విజయ్ దేవరకొండ. హాలీవుడ్లో తలకెక్కిన ది గ్లాడియేటర్ పాత్ర తనకు డ్రీమ్ రోల్ అని విజయ్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తనకు పాములంటే చాలా భయం అని తెలిపాడు. అలాగే తన చిన్నప్పుడు బస్సు డ్రైవర్,పోలీస్, క్రికెటర్, యాక్టర్  కావాలని కోరుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఇక విజయ్ డ్రీమ్ రోల్ తెలుసుకున్న అభిమానులు నిజంగానే అలాంటి పాత్ర వస్తే విజయ్ పర్ఫార్మెన్స్ ఇరగదీయడం పక్క అంటూ  కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: