టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇక ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సౌత్లో అవకాశాలు తగ్గడంతో ఇక బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అయితే ఇప్పటికే సౌత్ లో దాదాపు అందరూ స్టార్ హీరోల సినిమాల్లో నటించి సూపర్ హిట్ లు ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హాట్ హాట్ అందాలతో ఎంతోమంది కుర్ర కారు మతిపోగొట్టింది అని చెప్పాలి.


 అయితే ఇక ఇటీవల లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ నటించిన చత్రీవాలి సినిమా జి ఫైవ్ ఓటిటి వేదికగా విడుదలైంది అని చెప్పాలి. అయితే నేటి తరంలో ప్రతి ఒక్కరిలో లైంగిక అవగాహన పెంపొందించే కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో సురక్షితమైన శృంగారం గురించి పాఠాలు బోధించే కెమిస్ట్రీ టీచర్గా రకుల్ కనిపించింది అని చెప్పాలి.. ఇకపోతే ఇప్పుడు వరకు ఎక్కడ సినిమా ప్రమోషన్స్ లో తన కెరియర్ లో పడిన కష్టాల గురించి చెప్పని రకుల్.. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో మాత్రం ఓపెన్ అయ్యింది.


 సెలబ్రిటీ లైఫ్ అంటే అందరికీ కాస్ట్లీ లైఫ్, లగ్జరీ కార్లు, ఖరీదైన బంగాళాలు, విలాసవంతమైన జీవితం మాత్రమే గుర్తు వస్తుంది.. కానీ ఆ స్థాయికి రావడానికి వారు ఎంత కష్టపడ్డారు అన్నది ఎవరికీ తెలియదంటూ రకుల్ ప్రీత్ చెప్పుకొచ్చింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమ లోకి వచ్చాను. ఇక కొత్తలో చెప్పలేనని కష్టాలు కూడా అనుభవించాను. ముంబైలో ఎక్కడ ఆడిషన్స్ జరిగిన వెళ్లాను. ఇలా ఆడిషన్స్ కు వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని సార్లు కార్ లోనే డ్రెస్ మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కష్టపడి సినిమాలో సెలెక్ట్ అయితే ఇక షూటింగ్ సమయానికి నన్ను తీసేసి వేరే హీరోయిన్ పెట్టుకునేవారు.. అప్పుడు ఇంత కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను కష్టపడకుండా ఏదీ రాదు అంటూ చెప్పుకొచ్చింది రకుల్.

మరింత సమాచారం తెలుసుకోండి: