కానీ రామ్ చరణ్ మాత్రం కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్ పై కేవలం భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే నిర్మిస్తానని చెప్పుకొచ్చారు. అలాగే తన తండ్రితోనే సినిమాలు నిర్మిస్తానని కూడా చెప్పుకొచ్చారు. కానీ కరోనా కాలంలో రామ్ చరణ్ తన ఆలోచనలను పూర్తిగా మార్చుకున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ కూడా అందరి నిర్మాతలు లాగానే సరి కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చి చిన్న బడ్జెట్ సినిమాలు తీసేందుకు సిద్ధమవుతున్నారట. స్టార్ హీరోగా బిజీగా ఉన్నప్పటికీ కూడా రామ్ చరణ్ తన నిర్మాణ సంస్థను సమర్థవంతంగా నడపగలరు. కొందరు మాత్రం రామ్ చరణ్ హీరో కెరీర్ ని పక్కన పెట్టేసి నిర్మాణ సంస్థపై ఎక్కువగా ఆసక్తి చూపేందుకు సాహసించడం లేదని, అందుకే ఆచార్య నిర్మాణ బాధ్యతలను నుండి తప్పుకున్నారని చెబుతున్నారు.
కానీ రామ్ చరణ్ అతిత్వరలోనే నిర్మాతగా ఫుల్ బిజీ అవనున్నారని విశ్వసనీయ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మంచి సినిమాలు విడుదలవుతే తమ నిర్మాణ సంస్థ బలపడుతుందని రామ్ చరణ్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే మెగా హీరోలతో పాటు ప్రతిభ కలిగిన ప్రతి ఒక్కరితో సినిమాలు తీసేందుకు రామ్ చరణ్ సిద్ద పడ్డారట. ఇప్పటికే అన్ని కుర్ర దర్శకుల యొక్క కథలను వింటున్నారట. కథ నచ్చితే వెంటనే తమ బ్యానర్ పై సినిమా తీసేందుకు ఏ మాత్రం వెనుకాడరని తెలుస్తోంది. అయితే వ్యాపార వ్యూహంలో భాగంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నాడా లేకపోతే కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాడా అనేది ఇంకా తెలియ రాలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి