సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సచిన్ కూతురుగా ఈ భామా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. సారా ఎలాంటి సినిమాలలో నటించలేదు. కానీ హీరోయిన్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దానికి మించిన అందం, అభినయంతో ప్రతి ఒక్కరిని చూడగానే ఆకట్టుకుంటుంది. సారా టెండూల్కర్ బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటారు. ఎప్పుడూ బిజీగా ఉండే సారా తనకు సమయం దొరికినప్పుడల్లా తన ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. 


అక్కడ తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసిన సమయంలో తీసుకున్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి సంచలనంగా మారుతాయి. సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో ఏం చేసినా అది పెద్ద సంచలమే అవుతుంది. బయటికి వెళ్లిన, ఏదైనా అవుట్ ఫిట్ ధరించిన అవి హాట్ టాపిక్ గా మారుతాయి. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి సారా టెండూల్కర్ ప్రముఖ క్రికెటర్ శుబ్ మన్ గిల్ తో రిలేషన్ లో ఉన్నట్లుగా అనేక రకాల వార్తల వైరల్ అవుతున్నాయి.

దానికి గల ప్రధాన కారణం వీరిద్దరూ కలిసి చాలా సందర్భాలలో బయటికి వెళ్లడం, హోటల్స్, పార్టీలలో కలుసుకోవడం లాంటివి చేశారు. దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఈ క్రమంలోనే వీరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని గిల్ వేరే అమ్మాయితో, సారా మరో అబ్బాయితో ప్రేమలో ఉన్నట్లుగా... రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సారా టెండూల్కర్ వివాహం చేయాలని సచిన్ భావిస్తున్నారట.

తనపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తుండడంతో ఈ వార్తలకు ముగింపు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ఓ వార్త వైరల్ అవుతుంది. సారాకు వివాహం చేస్తేనే ఇలాంటి ఎఫైర్ వ్యవహారాలు, ప్రేమ వ్యవహారాలు తెరపైకి రావని సచిన్ భావిస్తున్నారట. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సారాకు సంబంధించిన ఈ వార్త హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ విషయం పైన సారా టెండూల్కర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: