
ఈ చిత్రంలో ఉపేంద్ర పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇటీవల విడుదలైన ఆయన క్యారెక్టర్ పోస్టర్ ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పాత్రల ఎంపికలో ఎప్పుడూ ప్రత్యేకతకు ప్రాధాన్యం ఇచ్చే ఉపేంద్ర, ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్ లో జాయిన్ అయ్యారు. ఆయన ఈ చిత్రంలో సూపర్ స్టార్ సూర్యకుమార్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్స్ కథానాయికగా నటిస్తోంది. ఇంత అద్భుతమైన తారాగణం, ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా భారీ అంచనాలని పెంచుతోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సిద్ధార్థ నూని, మ్యూజిక్ వివేక్–మర్విన్. జాతీయ అవార్డు విజేత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు