
ప్రెసెంట్ ఆయన నటించిన "ఖలేజా" సినిమా థియేటర్స్ తో రీ రిలీజ్ అయ్యి సందడి చేస్తుంది . అభిమానులు ఓ రేంజ్ లో ఈ మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే మూమెంట్లో అసలు త్రివిక్రమ్ ఎందుకు ఈ సినిమాకి "ఖలేజా".. అనే టైటిల్ పెట్టాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. నిజానికి "ఖలేజా" అంటే రకరకాల అర్థాలు వస్తాయి . మరీ ముఖ్యంగా ఖలేజా అంటే ఎక్కువగా అందరూ "ధైర్యం లేదా పట్టుదల" అని చెబుతూ ఉంటారు. అదే విధంగా హిందీలో మాత్రం "ఖలేజా" అంటే లివర్
అని అంటూ ఉంటారు .
అయితే త్రివిక్రమ్ శ్రీనివాస రావు ఈ సినిమాకి ఖలేజా అనే టైటిల్ పెట్టడానికి ప్రధానమైన కారణం వేరే ఉంది అంటూ అప్పట్లో జనాలు ఎక్కువగా మాట్లాడుకున్నారు . సాన్స్ స్క్రీట్ ప్రకారం "ఖ" అంటే 5 "లే" అంటే మూడు "జా" అంటే నాలుగు.. అంటే 534 మంది జనాలను కాపాడడానికి వచ్చిన దేవుడే ఈ మహేష్ బాబు అనే విధంగా సింబాలిక్ గా టైటిల్ లోనే అర్ధం చెప్పేలా "ఖలేజా" అనే టైటిల్ ని పెట్టాలని నిర్ణయించుకున్నారట త్రివిక్రమ్. మొత్తానికి ఖలేజా సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అయ్యి అభిమానులను రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుంది. మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామ మాత్రం మామూలుగా లేదు . ఈ సినిమాకే ఈ విధంగా ఉంటే ఇక రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ ఎలా ఊగిపోతారో ఊహించుకుంటుంటేనే వేరే లెవెల్ గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి..!!