
టాలెంటెడ్ హీరో వైభవ్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ హంటర్ చాప్టర్ 1 శుక్రవారం చాలా సైలెంట్ గా థియేటర్లలో విడుదలైంది. నందిత శ్వేతా, తాన్య హోప్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాకు షెరీఫ్ గౌస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఎ. రాజశేఖర్ & సాయి కిరణ్ బత్తుల నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో మంచి ఉత్సాహాన్ని నెలకొల్పి, సినిమా పై బజ్ ను పెంచాయి. ఈ చిత్రానికి సంగీతాన్ని అర్రోల్ కొరెల్లి అందించగా, సినిమాటోగ్రఫీని బాలాజీ కె రాజా చేపట్టారు. సస్పెన్స్, థ్రిల్, హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని అందిస్తోంది. చాలా థ్రిల్లింగ్ మూమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చాలా బాగా తెరకెక్కించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ లో థియేటర్ల కు సరైన ఫీడింగ్ లేదని అందరూ తీవ్ర ఆవేదనతో ఉన్న వేళ వచ్చిన ఈ హంటర్ చాప్టర్ 1 ప్రేక్షకులను చాలా సైలెంట్ గా థియేటర్ల వైపు వెళ్లేలా చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సమస్య మీది.. పరిష్కారం మాది.. జాగృతం కండి తెలుగు ప్రజలారా...
సమస్యలు లేని వ్యక్తులే కాదు.. సమాజం కూడా లేదు. అయితే.. సమస్య వచ్చినప్పుడు.. దానిని ఎవరికి చెప్పాలి ? ఎవరిని కలవాలి ? ఎలా పరిష్కరించుకోవాలి ? అనేది కీలకం. అది అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.
నోట్ : వ్యక్తిగత, కుటుంబ సమస్యలు వద్దు