మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి మాళవిక మోహన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమె 2013 వ సంవత్సరం లో వచ్చిమాయల సినిమా పట్టం పోల్ ద్వారా సినీ రంగం లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగు , తమిళం , హిందీ భాషా సినిమాల్లో నటించింది. ఈమెకు కెరియర్ ప్రారంభంలో తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈమె తమిళ స్టార్ నటుడు తలపతి విజయ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ మూవీ లో హీరోయిన్గా నటించింది.

మూవీ ద్వారా ఈమెకు తమిళ ఇండస్ట్రీలో సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. ఈ మూవీ తెలుగులో కూడా విడుదల అయ్యి టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి  విజయాన్ని సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మకు తెలుగులో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా కనుక మంచి విజయం సాధిస్తే తెలుగులో మాళవిక క్రేజ్ భారీ స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయి.

తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమె తనకు ఓ దర్శకుడి సినిమాలో నటించాలని ఉన్నట్లు పేర్కొంది. తాజా ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ తనకు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉన్నట్లు పేర్కొంది. ఇలా ఈ బ్యూటీ చెప్పడంతో ఒక వేళ ఈమెకు రాజమౌళి దర్శకత్వంలో రూపొందే సినిమాలో హీరోయిన్గా అవకాశం వస్తే ఈమె స్టార్ హీరోయిన్ స్టేటస్ కి చేరుకోవడం పక్క. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ని కూడా ఈమె ఏలే అవకాశం ఉంటుంది. అదే జరిగితే అనేక మంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా సైడ్ ఇచ్చుకోవాల్సిందే అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

mm