ఈ మధ్యకాలంలో లీక్స్ అనేటివి బాగా ఎక్కువగా చూస్తున్నాం . మరీ ముఖ్యంగా సినిమా స్టార్ట్ అయిన మొదలు ఎండింగ్ వచ్చేవరకు సినిమా రిలీజ్ కంటే ముందునే సోషల్ మీడియాలో అన్ని సీన్స్ ..వీడియోస్ పాటలు లీక్ అయిపోయి వైరల్ అవుతున్నాయి . తద్వారా మేకర్స్ కి భారీ స్థాయిలో నష్టాలు కూడా వస్తున్నాయి . ఇది కేవలం ఒక స్టార్ హీరో సినిమాకే కాదు చిన్న హీరోల సినిమాలకి కూడా వస్తున్నాయి . స్టార్ హీరోలో సినిమాలకు సంబంధించిన విషయాలు లీక్ అయితే భారీ మొత్తంలో నష్టం వస్తుంది చిన్న హీరోల సినిమాకు సంబంధించిన విషయాలు లీక్ అయితే కొంచెం నష్టం వస్తుంది.


తాజాగా మెగాస్టార్ చిరంజీవి - నయనతార హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మెగా 157 సినిమా నుంచి కొన్ని సీన్స్ లీక్ అయ్యి  సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి నయన్ - చిరు ఉన్న కొన్ని పిక్స్ వీడియోస్ లీక్ అయ్యి వైరల్ అయ్యాయి. దీంతో చిత్ర బృందం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది . దీనిపై లేటెస్ట్గా మేకర్స్ అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ వారు మెగా 157 సినిమా షూటింగ్ సెట్స్ నుంచి బయటకు వచ్చిన విజువల్స్ విషయాన్ని సీరియస్ గా తీసుకొని వార్నింగ్ ఇచ్చారు .



"తమ బ్యానర్ లో ఈ సినిమాని ఎంతో శ్రమించి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నామని .. సో ఎవరైనా సరే లీక్స్ ని షేర్ చేసిన బయటపెట్టిన వాళ్ళకి లీగల్ సమస్యలు తప్పవని వార్నింగ్ ఇస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ". నయనతార షూటింగ్  సెట్స్ లో ఉన్న కొన్ని పిక్చర్స్ వీడియోస్ వైరల్ కావడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  దీని పట్ల మెగా ఫ్యాన్స్ కూడా సీరియస్ అవుతున్నారు. ఎవరైనా కావాలని ఇలా లీక్ చేస్తే సోషల్ మీడియా ద్వారా వార్నింగ్ ఇస్తున్నారు.  సోషల్ మీడియాలో ఇప్పుడు మెగా 157 సినిమాకి సంబంధించిన ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది.  కేవలం ఈ సినిమాకు మాత్రమే కాదు గతంలో ఎన్నో సినిమాలకు సైతం ఇదేవిధంగా లీక్స్ భారీ నష్టాలు తీసుకొచ్చింది. నష్టాల నుంచి తప్పించుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇలా మేకర్స్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అంటున్నారు జనాలు..!!



మరింత సమాచారం తెలుసుకోండి: