
ముఖ్యంగా చాలామంది సందీప్ ని స్త్రీ విద్వేషి అంటూ చాలామంది విమర్శించడం జరిగింది. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ వంటి వారు సందీప్ రెడ్డి వంగా ను ప్రశంసిస్తూ ఇ లాంటి దర్శకుడు మరొకరిని చూడలేదు అంటూ సందీప్ రెడ్డి పై భుజం వేసి గంటలకు కొద్ది మాట్లాడారు. అప్పటినుంచి ఆయన అభిమానిగా మారారు. నిజాయితీగా సినిమా తీసే డైరెక్టర్ గా ప్రశంసించారు. అయితే ఇప్పుడు తాజాగా డైరెక్టర్ మోహిత్ సూరి తాజా ఇంటర్వ్యూలో తన మనసులో ఉన్న విషయాలను బయటపెట్టడం జరిగింది.
ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగాను విమర్శించిన బాలీవుడ్ నుంచే మరొక డైరెక్టర్ సందీప్ పైన ఉండే అభిమానాన్ని దాచుకోలేకపోయారు. అంతేకాకుండా సందీప్ రెడ్డి కి కూడా అతను క్షమాపణలు చెప్పడం జరిగింది. మోహిత్ సూరి మాట్లాడుతూ డైరెక్టర్ సందీప్ వంగాకు తాను ఒక పెద్ద అభిమానిని.. యానిమల్ చిత్రాన్ని చూసి ఇష్టపడ్డాను కానీ అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదురవ్వడం వల్ల సైలెంట్ గా ఉండిపోయాను ఆ సమయంలో మద్దతుగా నిలవలేకపోవడం తన తప్పు అంటూ తెలిపారు. అందుకే డైరెక్టర్ సందీప్ కి క్షమాపణలు చెప్పానని తెలిపారు. నిజాయితీ, దృఢ నిశ్చయంతో సినిమాలు తీసే డైరెక్టర్ సందీప్ వంగా అంటూ ప్రశంసలు కురిపించారు.