
స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఘాటీ మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత అనుష్క నటించిన సినిమా కావడం, సెలెక్టెడ్ పాత్రల్లో మాత్రమే అనుష్క నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ సినిమాపై అంచనాలను ఆకాశమే హద్దుగా పెంచేశాయి.
కథ :
స్టార్ డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా కోసం సరికొత్త కాన్సెప్ట్ ను తీసుకోగా సినిమాలో మెజారిటీ సన్నివేశాలు అనుష్క ప్రధానంగా తెరకెక్కాయి. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులో గంజాయిని అక్రమ రవాణా చేసే ముఠా తాము చేస్తోంది తప్పు అని భావించి తాము మారడంతో పాటు ఇతరులను సైతం మారుస్తారు. ఆ సమయంలో యాజమాన్యం వారిపై దాడులు చేయగా ఆ సమయంలో శీలావతి (అనుష్క) విక్టిమ్ గా మారుతుంది.
తనకు జరిగిన అన్యాయానికి శీలావతి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది? ఆమె లెజెండ్ గా మారి అన్యాయం చేసిన వారిని ఏ విధంగా శిక్షించిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
విశ్లేషణ :
ఔట్ అండ్ ఔట్ భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్న ఈ సినిమా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుంది. సినిమాలో సబ్ ప్లాట్స్ ఎక్కువగా ఉండగా క్రిష్ ఎగ్జిక్యూషన్ మాత్రం అదిరిపోయింది. సినిమాలోని ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు క్రిష్ నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారు. ఘాటీ సినిమాతో క్రిష్ సైతం ఒక కొత్త యూనివర్స్ ను క్రియేట్ చేశారనే చెప్పాలి. సినిమాలో కథనం విషయంలో వచ్చే ట్విస్టులు సైతం ఒకింత ఆసక్తికరంగా ఉన్నాయి. డైలాగ్స్, ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి.
సినిమాలో బ్లడ్ బాత్ సన్నివేశాలతో అనుష్క అరుంధతి, భాగమతి సినిమాలను గుర్తు చేసింది. కొన్ని సన్నివేశాల్లో ఆ సినిమాలను మించి అద్భుతమైన పర్ఫామెన్స్ ను అనుష్క కనబరిచారు. చైతన్యరావు సైతం తన నటనతో మెప్పించారు. డైరెక్టర్ క్రిష్ కు ఈ సినిమాతో పూర్వ వైభవం వచినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఘాటీ సినిమాతో అనుష్కకు పూర్వ వైభవం వచ్చిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
టెక్నీకల్ గా కూడా ఈ సినిమా స్ట్రాంగ్ గా ఉంది. మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీకి సంబంధించిన టెక్నీషియన్లు ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు. యువి క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఘాటీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.
బలాలు : అనుష్క నటన, క్రిష్ డైరెక్షన్, కథ, కథనం, ఆసక్తికర ట్విస్టులు
బలహీనతలు : సినిమాలోని కొన్ని సన్నివేశాలు
రేటింగ్ : 3.0/5.0