టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ నటులలో తేజ సజ్జ ఒకరు. తేజ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ్ , కన్నడ ,  మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో తేజ కు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. హనుమాన్ లాంటి భారీ విజయం తర్వాత తేజ , కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ అనే సినిమా లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపించనుండగా ... శ్రేయ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి. ఈ మూవీ ని సెప్టెంబర్ 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చాలా భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని హిందీ లో కరణ్ జోహార్ విడుదల చేయబోతున్నాడు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా తేజ ముంబై లో ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించాడు. ముంబై లో జరిగిన ప్రెస్ మీట్ లో భాగంగా తేజ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా తేజ మాట్లాడుతూ ... తెలుగు సినిమా ఖ్యాతి ని దేశ వ్యాప్తంగా , ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే విషయంలో దర్శకుడు రాజమౌళి తో సహా పలువురు హీరోలు ఎంతో కష్టపడ్డారు. తమ ఆరోగ్యాన్ని కూడా పడు చేసుకున్నారు. తెలుగు సినిమా ఖ్యాతి ని దేశ వ్యాప్తంగా , ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే విషయంలో రాజమౌళి సార్ తో సహా ప్రభాస్ , తారక్ , చరణ్ అన్న తమ విలువైన సమయాన్ని , ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు. వారు ఎంతో కష్టపడి మాకు ఒక దారిని వేశారు. ఆ దారిలో మేమంతా పయనిస్తున్నాం అని తేజ తాజాగా చెప్పుకొచ్చాడు. తేజ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: