టాలీవుడ్ ప్రేక్షకులకు తాజాగా విడుదలైన “కిష్కిందపురి” సినిమా ఒక కొత్త ఫీల్ ఇచ్చింది. హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రీఎంట్రీకి ఈ సినిమా మేజర్ సపోర్ట్ ఇచ్చినా, అసలు టాక్ మాత్రం విలన్ పాత్ర చేసిన శాండీ మాస్టర్ వైపు మళ్లింది. లియోలో "కాఫీ" సీన్‌లో భయపెట్టిన అతని లుక్స్ ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు కిష్కిందపురిలో మరోసారి తన విభిన్నమైన స్టైల్‌తో అదరగొట్టాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో అతని ఎంట్రీ కథను పూర్తిగా డామినేట్ చేసింది. హీరో లేకపోయినా, 20 నిమిషాలపాటు స్క్రీన్ మీద విలన్ ఒక్కడే షో రన్ చేయగలడని ప్రూవ్ చేసాడు. 2005లో కొరియోగ్రాఫర్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టిన శాండీ, మొదట్లో యాంకర్ ఓంకార్ హోస్ట్ చేసిన "ఛాలెంజ్" రియాలిటీ షోలో నృత్య దర్శకుడిగా పని చేశాడు.

ఇక అక్కడి నుంచి అతని ప్రతిభను గమనించిన ఫిల్మ్ మేకర్స్, సినిమాల్లో అవకాశం ఇచ్చారు. "కూలీ" సినిమాలోని “మౌనిక మౌనిక” సాంగ్లో పూజా హెగ్డే, సౌబిన్ షాహిర్‌తో  స్టెప్పులు వేయించింది ఈ శాండీనే.  దగ్ లైఫ్, తంగలాన్, విక్రమ్, ఆవేశం లాంటి సూపర్ హిట్స్ సినిమాల్లో పని చేస్తూ ఇండస్ట్రీలో సాలిడ్ ఫుట్ ప్రింట్ వేసాడు. ఇక సైకో లుక్స్, విచిత్రమైన రూపాలు, భయపెట్టే బాడీ లాంగ్వేజ్‌తో  “బెస్ట్ విలన్ ఛాయిస్” గా మారిపోయాడు శాండీ. అతని ఎక్స్‌ప్రెషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమా కంటెంట్‌కి రియల్ స్ట్రెంగ్త్ ఇచ్చాయి. “కిష్కిందపురి”లో కూడా అదే ఫార్ములా వర్కౌట్ అయింది. వ్యక్తిగత జీవితం కూడా సినీ జర్నీ లాగే ఇంట్రెస్టింగ్. 2009లో నటి కాజల్ పశుపతిని వివాహం చేసుకున్నాడు.

అయితే మూడు సంవత్సరాలకే విడాకులు ఇచ్చి, 2017లో సోషల్ మీడియా సెలబ్రిటీ దొరతి స్లవియాని రెండోసారి వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు. ప్రస్తుతం శాండీ మలయాళంలో అనుష్క కథనర్‌తో పాటు, తమిళంలో “బ్లాబ్లాబ్లా” అనే ప్రాజెక్ట్‌లో ప్రాధాన్యమైన పాత్ర చేస్తున్నాడు. టాలీవుడ్‌లో కూడా "కిష్కిందపురి" పుణ్యమాని కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఇకపై రెగ్యులర్‌గా తెలుగు సినిమాల్లో కూడా విలన్‌గా కనిపించే అవకాశాలు బలంగానే ఉన్నాయి. కొరియోగ్రాఫర్‌గా వచ్చిన ఒక వ్యక్తి, విలన్‌గా ఇంత స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేయడం చాలా అరుదు. శాండీ మాస్టర్ ఇప్పుడు “సైకో విలన్ స్పెషలిస్ట్”గా సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపై అతని డిమాండ్ యాక్షన్ సినిమాల్లో మరింత పెరగడం ఖాయం!

మరింత సమాచారం తెలుసుకోండి: