పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 ఎడి మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో సీక్వెల్‌పై అంచనాలు అమాంతం పెరిగాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ సైఫై ఫాంటసీ నేపథ్యంలో విభిన్నంగా తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్‌కి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇప్పుడు అదే స్థాయిలో కాక మరింత భారీగా పార్ట్ 2ను రూపొందించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీక్వెల్‌కు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. మొదటి భాగంలో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకోణ్ సీక్వెల్‌లో ఉండ‌రని మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. నిజానికి కథలో ఆమె పాత్రకు కొనసాగింపుగా ఉండాల్సిన ట్రాక్‌ను మేకర్స్ మార్చే ఆలోచనలో ఉన్నారని టాక్. దీంతో ఆ స్పేస్‌ను భర్తీ చేసేది ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


బాలీవుడ్, టాలీవుడ్ సహా పలు నటీమణుల పేర్లు వినిపిస్తున్నా, దీపికా స్థాయి స్క్రీన్‌ ప్రెజెన్స్ కలిగిన నటి దొరకడం అంత సులభం కాదని విశ్లేషకులు అంటున్నారు. అందుకే నాగ్ అశ్విన్ అండ్ టీమ్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారని సమాచారం. సీక్వెల్ కథలో ఆ పాత్రను బలంగా నిలబెట్టడం కోసం కచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉంటే క‌ల్కి 2 ప్రీ-ప్రొడక్షన్ పనులు, సెట్ డిజైన్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం మేకర్స్ ప్రభాస్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన షూటింగ్‌లో పాల్గొనే సమయాన్నిబట్టి మేక‌ర్స్‌ అధికారికంగా పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఏదేమైనా కల్కి 2898 ఎడి పార్ట్ 2లో కొత్త నటి ఎవరవుతుందో అనే ఆసక్తి మాత్రం అభిమానుల్లో పీక్‌కు చేరింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: