
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉండి ఏపీలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రమాదమని గుర్తించి.. రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకులను ఎదగనివ్వకుండా చేసినటువంటి పేపర్లలో ఈనాడు కూడా ఒకటి. అయితే భారతీయ జనతా పార్టీతో కూడా ఈనాడు పేపర్ స్నేహ బంధాన్ని మెయింటైన్ చేశారు. గుజరాత్ లో ఛానల్ పెట్టి ఈటీవీ భారతీయ జనతా పార్టీకి ఫేవర్గానే ఉన్నది. నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు సపోర్టివ్ గానే నిలిచింది ఈనాడు. అందుకే బిజెపికి నరేంద్ర మోడీకి కూడా ఈనాడు అంటే అభిమానమే.
అందుకే రామోజీరావు దగ్గరికి అమిత్ షా ఎన్నోసార్లు వెళ్లారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. మార్గదర్శి ఫైనాన్స్ పైన అనుమతి లేనటువంటి సంస్థ అంటూ రిజర్వ్ బ్యాంకు కి కంప్లైంట్ కూడా చేశారు. రిజర్వ్ బ్యాంక్ అవును అలా పెట్టడానికి వీలు లేదని చెప్పినప్పటికీ.. రిజర్వ్ బ్యాంకు ప్రకారం మార్గదర్శి సంస్థకి ప్రత్యేకించి రూల్స్ ఇవ్వలేమని చెప్పి వాటిని తీసేయాలని హెచ్చరించింది. అలా ఎంతోమంది వేల కోట్ల రూపాయల డబ్బులు అందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ డబ్బులని అటు సినిమాలకు తిప్పడం, ఈటీవీ వంటి సంస్థను నడిపించడం , రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి అన్నిటికీ కూడా మార్గదర్శి పెట్టుబడి లో నుంచే తీసుకున్నారు.. ముఖ్యంగా తక్కువ వడ్డీకే డబ్బులు ఇస్తున్నారని తెలిసి ప్రజలు కూడా ఇందులో ఎక్కువగానే తీసుకునేవారు. అయితే చివరికి దెబ్బ పడటంతో రిలయన్స్ వాళ్ళు మార్గదర్శిని కొనేశారు. అయితే అలా గట్టెక్కించడానికి కారణం బిజెపి పార్టీ అధినాయకత్వమే. కానీ సరైన సమయంలో ఈనాడు బిజెపికి దెబ్బేసినా.. అభిమానం మాత్రం ఈనాడు మీద బిజెపికి పోలేదు. అయితే ఇటీవలే అన్నదాతకు సంబంధించి గుజరాత్ లో నిర్వహించిన ప్రోగ్రామ్ తో పాటుగా.. 30 ఏళ్లు ఈనాడు, ఈటీవి పెట్టినటువంటి సందర్భంగా ఒక మెమెంటో కూడా ఇచ్చారు. ఈ సందర్భంలో గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఈనాడును రెగ్యులర్ గా చూసేవాడినంటూ మోదీ అభినందించారు.