
అయితే, తాజాగా ఈ యూనివర్సిటీకి గుర్తింపు రద్దు చేయాలని ఉన్నత విద్యా కమిషన్ (APHEC) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కారణం — ఫీజుల విభజన నిబంధనలను ఉల్లంఘించడం అని పేర్కొంది. పక్క ఆధారాలతో కలిపి ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ ఇటీవల ఉన్నత విద్యా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.దీంతో యూనివర్సిటీని తక్షణమే మూసివేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ కమిషన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. నివేదిక ప్రకారం, గత మూడు సంవత్సరాలలో విద్యార్థుల నుండి 26 కోట్ల 15 లక్షల రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేసినట్లు తేలింది. ఈ ఏడాది జనవరిలో యూనివర్సిటీపై ₹15 లక్షల జరిమానా కూడా విధించబడింది. అయితే, ఆ ఉత్తర్వులను యాజమాన్యం పట్టించుకోలేదని పేర్కొన్నారు.
కమిషన్ ఇప్పుడు యాజమాన్యానికి 26 కోట్ల ఫీజులు మరియు 15 లక్షల జరిమానా మొత్తాన్ని 15 రోజుల్లో చెల్లించాలి అని ఆదేశాలు జారీ చేసింది. అలాగే యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని సిఫారసు చేసింది.ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుండగా, మోహన్ బాబు మరియు ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యూనివర్సిటీ యాజమాన్యం తమ పరువుకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారం పబ్లిక్‌లో ఉంచారని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించారు.
ఇక తాజాగా మంచు విష్ణు కూడా ఈ అంశంపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ నోట్ రిలీజ్ చేశారు. —“ఏపీ ఉన్నత విద్యా కమిషన్ చేసిన సిఫారసులపై కోర్టు స్టే విధించింది. అమెరికాలోని యూనివర్సిటీతో జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టిన దేశంలో ఏకైక యూనివర్సిటీ మాదే. APHEC నివేదికలోని కొన్ని అంశాలను కావాలనే తప్పుడు రీతిలో ప్రచారం చేస్తున్నారు. మా యూనివర్సిటీని కావాలనే తొక్కాలని కొందరు చూస్తున్నారు. తల్లిదండ్రులు వీటిని నమ్మవద్దు. ఎప్పటికీ మా దగ్గర క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది.”
“1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్థాపించబడింది. అప్పటి నుండి ఈ విశ్వవిద్యాలయం సామాజిక సేవా దృక్పథంతో ముందుకు సాగుతోంది. ఎంతోమందికి ఉచిత విద్యను అందించాము. పోలీసు మరియు సాయుధ దళాల పిల్లలకు పూర్తిస్థాయి స్కాలర్షిప్లు ఇవ్వడం కూడా జరిగింది. అనాథలను దత్తత తీసుకొని వారికి పూర్తి విద్యా, సంరక్షణా సదుపాయాలు కల్పించాము. విద్యా మరియు సామాజిక రంగాలలో మా సేవలు ఎల్లప్పుడూ బహిరంగ రికార్డుల్లో ఉన్నాయి. అయినప్పటికీ, కొంతమంది దురుద్దేశంతో పదేపదే మా ప్రయత్నాలను విమర్శిస్తున్నారు.”
“అంతర్జాతీయ స్థాయిలో మేము ముందంజలో ఉన్నాం. విచారణ సమయంలో మోహన్ బాబు యూనివర్సిటీ పూర్తి స్థాయిలో కమిషన్‌కు సహకరించింది అని నివేదికలోనే స్పష్టంగా ఉంది. మాకు ఎల్లప్పుడూ అండగా నిలిచే వేలమంది తల్లిదండ్రులు, విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదాలు.” “మా గౌరవనీయ చాన్సలర్ డా. ఎం. మోహన్ బాబు గారి మార్గదర్శకత్వంలో, మేము ప్రపంచస్థాయి సమగ్ర విద్యను అందిస్తూ యువతను శక్తివంతం చేయడమే మా లక్ష్యం. తల్లిదండ్రులు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దు.”అని మంచు విష్ణు ఒక ప్రకటన విడుదల చేశారు.