
ఈ విషయాలపై ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ పోలీసులను అడ్డుపెట్టుకొని, కూటమి నేతలు వాళ్ల ప్లాన్ ప్రకారం ఈ పర్యటనను అడ్డుకోవాలని చూస్తే.. అలాంటి వాటిని సాగనివ్వమంటూ ఘాటైన హెచ్చరికను తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీ నేతలకు కౌంటర్ వేశారు. మాజీ మంత్రి అమర్నాథ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటే, మక్కెలు విరగ్గొడతామంటూ ఆయన హెచ్చరించారు. మెడికల్ కాలేజీ సందర్శనకు జగన్ వెళ్లడానికి కాస్తయినా సిగ్గుండాలి అంటూ గంటా శ్రీనివాస్ విరుచుకుపడ్డారు.. హద్దు మీరితే తోక ఎలా కట్ చేయాలనే విషయం మా బాబుగారికి బాగా తెలుసు అంటూ మాజీ మంత్రి గంటా హెచ్చరించారు.
అయితే ఈ విషయాలపైన వైసీపీ నేతలు, కార్యకర్తలు 2019 ఎన్నికలలో వైసిపి భారీ విజయాన్ని అందుకున్నప్పుడు, ఈ ఎన్నికలలో టిడిపి నుంచి పోటీ చేసి గెలిచిన గంటా శ్రీనివాస్ ఐదేళ్లు ఎలా గడిపారో అందరికీ తెలుసు. ఒకానొక సమయంలో వైసీపీ పార్టీలోకి రావడానికి ప్రయత్నాలు చేసిన వైయస్ జగన్ అంగీకరించలేదని ప్రచారం కూడా జరిగింది.. కేవలం అధికారం కోసమే గంట రాజకీయాలను చేస్తున్నారనే బలమైన విమర్శలు కూడా తెలియజేస్తున్నారు. గత ఎన్నికలలో ఆయనకు టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు ఆలోచించారు చివరి నిమిషంలో ఇచ్చారు.. ఇప్పుడు అలాంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి పదవి దక్కుతుందని భావించిన దక్కలేదు అందుకే ఇప్పుడు పెద్దల మెప్పుకోసం వైసిపి అధినేత పైన ,వైసీపీ నాయకుల పైన ఇలా చెలరేగిపోతున్నారంటూ మాట్లాడుతున్నారు