సినిమా ఇండస్ట్రీలో అందాలకి, స్టార్‌డమ్‌కి కొదవే లేదు. ప్రతీ కొత్త సినిమాతో కొత్త ముఖాలు, కొత్త అందాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటాయి. అలాంటి క్రమంలో ఒక్క సినిమాతోనే బీ-టౌన్‌ను షేక్ చేసిన హీరోయిన్ గాయత్రి జోషి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా.. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కంటే ఆమె భర్త ఆస్తులు మూడింతలు ఎక్కువ అన్న వార్త మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 1977 మార్చి 20న ముంబైలో జన్మించిన గాయత్రి జోషి, 2004లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె చేసిన ఒకే ఒక్క సినిమా ‘స్వదేస్’. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ హీరోగా, అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించారు.
 

సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా కలెక్షన్లు రాబట్టకపోయినా.. మ్యూజిక్, కథాంశం పరంగా హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత గాయత్రి జోషి సినీ రంగానికి గుడ్‌బై చెప్పేసింది. అదే సంవత్సరం బిజినెస్ మాన్ వికాస్ ఒబెరాయ్‌ను వివాహం చేసుకుని లగ్జరీ లైఫ్‌లోకి అడుగుపెట్టింది. వికాస్ ఒబెరాయ్ పేరు బిజినెస్ ప్రపంచంలో ఎవరికీ కొత్త కాదు. ఆయన ఒబెరాయ్ రియాల్టీ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ముంబైలోని వర్లి ప్రాంతంలో ఈ సంస్థ చేపట్టిన ప్రతిష్ఠాత్మక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ “360 వెస్ట్” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక్కో లగ్జరీ ఫ్లాట్ ధర రూ. 45 కోట్లకు పైగా ఉంటుంది. బాలీవుడ్ స్టార్‌లు కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. అలాగే వెస్టిన్ హోటల్ కూడా వికాస్ ఒబెరాయ్ యాజమాన్యంలో ఉండటం గమనార్హం.



తాజాగా విడుదలైన హురున్ రిచ్ లిస్టు 2025 ప్రకారం, వికాస్ ఒబెరాయ్ నికర ఆస్తుల విలువ రూ. 42,960 కోట్లు (4.2 బిలియన్ డాలర్లు). ఇదే సమయంలో షారూఖ్ ఖాన్ ఆస్తుల విలువ రూ. 12,490 కోట్లు (1.2 బిలియన్ డాలర్లు). అంటే షారూఖ్ కంటే గాయత్రి భర్త వికాస్ ఒబెరాయ్ ఆస్తులు మూడున్నర రెట్లు ఎక్కువ. ఈ లిస్టులో వికాస్ ఒబెరాయ్ 58వ స్థానంలో నిలిచారు.ఒక్క సినిమాతోనే పేరు తెచ్చుకున్న గాయత్రి జోషి.. ఇప్పుడు లగ్జరీ లైఫ్‌లో ‘యువరాణి’లా బతుకుతోంది. ఇద్దరు పిల్లల తల్లిగా, తన భర్త బిజినెస్ కార్యకలాపాలను చూసుకుంటూ ఫ్యామిలీ లైఫ్‌లో హ్యాపీగా గడుపుతోంది. షారూఖ్‌తో నటించిన హీరోయిన్ ఇప్పుడు బాద్‌షా కంటే ఎక్కువ ఆస్తుల వారసురాలిగా నిలవడం.. ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది.


https://www.instagram.com/reel/DLfbfMVyyJ-/?utm_source=ig_web_copy_link

మరింత సమాచారం తెలుసుకోండి: