
ఆమె దృష్టిలో టాలెంట్ ఉన్న డైరెక్టర్‌కే విలువ ఉంటుంది, పేరు లేదా ఫేమ్ కాదు — ఇదే ఆమె ప్రత్యేకత. ప్రస్తుతం నయనతార మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న “మన శంకర్ వరప్రసాద్” సినిమా షూట్ లో బిజీగా ఉంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని సమాచారం. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా ముగింపు దశలోకి చేరుకోగా, సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చిరంజీవి మరియు నయనతార కాంబినేషన్‌లో వచ్చే ఈ సినిమా హాస్యం, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీగా ఉండబోతుందనే నమ్మకం ఫ్యాన్స్‌లో ఉంది.
ఇంతలోనే నయనతార మరో తమిళ ప్రాజెక్ట్‌ను కూడా ప్రకటించింది. ఈ సినిమా పేరు “హాయ్” . ఇందులో నయనతారతో పాటు ప్రతిభావంతుడు కవి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న వ్యక్తి యువ, టాలెంటెడ్ డైరెక్టర్ విష్ణు ఎవడన్. ఆయన కథలు, దిశ, ప్రెజెంటేషన్‌కి తమిళ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. “విష్ణు అంటే టాలెంట్‌కి కొత్త నిర్వచనం” అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. “హాయ్ చెప్పండి…” అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన ఆ పోస్టర్‌లో నయనతార అండ్ కవి జంటగా ఎంతో ఆకర్షణీయంగా కనిపించారు. వారి కెమిస్ట్రీ పోస్టర్‌లోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టైలిష్ లుక్స్, కలర్ టోన్, ఫ్రెష్ వైబ్రేషన్‌తో ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమా యూనిట్ సమాచారం ప్రకారం, “హాయ్” ఒక ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం షూటింగ్ మొదటి షెడ్యూల్ చెన్నైలో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించబోతున్నారని ప్రొడ్యూసర్స్ తెలిపారు. ఇక నయనతార కెరీర్ గురించి మాట్లాడుకుంటే, ఆమె ఎప్పుడూ తన పాత్రలను, కథలను ఎంతో ఆచితూచి ఎంచుకుంటుంది. సినిమా ఎంత పెద్దది అన్నది కాదు, అందులో తన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందన్నదే ఆమె నిర్ణయంలో కీలకం. అందుకే ఆమె స్టార్ డైరెక్టర్ల కన్నా, టాలెంట్ ఉన్న కొత్త దర్శకులకు కూడా అవకాశాలు ఇస్తుంది. ఇదే కారణం ఆమె ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించడానికి ప్రధాన కారణం. సినీ అభిమానులు కూడా ఇదే చెబుతున్నారు . “అందుకే నయనతారకు క్రేజ్ కంటే కూడా రెస్పెక్ట్ ఎక్కువ. ఆమె టాలెంట్‌ని గౌరవిస్తుంది, కొత్తవారికి దారి చూపిస్తుంది.” అంటున్నారు. అదే నిజమైన “లేడీ సూపర్ స్టార్”కి తగ్గ లక్షణం అని అందరూ అభిప్రాయపడుతున్నారు..!!