ఇటీవల ఉపాసన తల్లి సోషల్ మీడియా ద్వారా అధికారికంగా "ఆమె గర్భవతి.. త్వరలోనే ట్విన్స్‌కి జన్మనివ్వబోతుంది అని" చెప్పడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. దీనితో పాటు, ఇటీవలే మెగా ఫ్యామిలీ ఎంతో ఘనంగా మినీ సీమంతం వేడుకను కూడా నిర్వహించింది. ఆ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కేవలం కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో జెట్ స్పీడ్‌లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ వేడుకల ఆనందంలో మునిగిపోయిన అభిమానుల్లో మరో కొత్త చర్చ మొదలైంది. ఉపాసన ట్విన్స్‌కి జన్మనిచ్చిన తర్వాత ఆమె పూర్తిగా తన పనులన్నీ పక్కన పెట్టి విశ్రాంతి తీసుకుంటుందా? లేక మళ్లీ చాలా త్వరలోనే తన ప్రొఫెషనల్ లైఫ్‌లోకి ఎంటర్ అవుతుందా? అనేది అందరికీ బిగ్ క్వశ్చన్ మార్క్‌గా మారింది.
సాధారణంగా మహిళలు రెండో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత శరీరంలో అనేక రకాల మార్పులు వస్తాయి. హార్మోన్ల స్థాయి మారడం, శక్తి లోపం, మానసిక ఒత్తిడి వంటి పరిస్థితులు సహజం. వైద్యపరంగా కూడా కనీసం ఆరు నెలల నుంచి ఏడాది వరకు పూర్తి విశ్రాంతి అవసరం అని చెబుతారు. కానీ ఉపాసన లాంటి మల్టీ టాస్కర్‌కి, అంత బిజీ లైఫ్ స్టైల్ ఉన్న వ్యక్తికి ఈ విరామం సాధ్యమవుతుందా అనే సందేహం అభిమానుల్లో మొదలైంది. అయితే మెగా అభిమానులలో కొందరు మాత్రం, “ఉపాసన చాలా ముందుచూపు కలిగిన వ్యక్తి. ఆమె చేసే ప్రతి పని పక్కా ప్లానింగ్‌తోనే ఉంటుంది. కుటుంబం, కెరీర్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో ఆమెకు ఎవరూ సాటిరారు. కాబట్టి ఈసారి కూడా ఆమె తన పిల్లలకి సమయం కేటాయిస్తూ, ప్రొఫెషనల్ లైఫ్‌కి అంతరాయం రాకుండా పర్ఫెక్ట్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టే ఉంటుంది” అంటూ సమర్థిస్తున్నారు.ఇదే సమయంలో, కొంతమంది నెటిజన్లు, “ఉపాసన అంటే సింపుల్ వుమన్ కాదు. ఆమె తన బాధ్యతలను చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. కాబట్టి పిల్లల పుట్టిన తర్వాత ఆమె తప్పకుండా విశ్రాంతి తీసుకుంటుంది. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంది” అని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి