అంతర్జాతీయ విమానాలపై గత ఏడాది మార్చి 23 వ తేది నుండి ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే ఆ నిషేధం ఆగష్టు 31 వ తేదీతో ముగియనుండగా అంతర్జాతీయ విమానాలపై ఉన్న నిషేధాన్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ విమానాల నియంత్రణ సంస్థ డీజీసీఏ తెలిపింది.అయితే వందే భారత్ మిషన్ ఒప్పందం కారణంగా,ఎయిర్ బబుల్ ఒప్పందం కారణంగా కొన్ని అంతర్జాతీయంగా రాకపోకలు కొనసాగుతున్నాయి.అమెరికా,యుకే,ఫ్రాన్సు వంటి దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కొనసాగుతుంది.తాజా నిషేద పొడగింపు కార్గో విమానాలపై వర్తించదు అని డీజీసీఏ తెలిపింది.


నష్టాల ఉబిలో కూరుకుపోయిన విమాన రంగానికి ఇది ఇంకో ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ విమానాలపై ఉన్న నిషేధాన్ని సెప్టెంబర్ 30 వరకు  పొడిగించటంతో ఈ ఏవియేషన్ రంగానికి తెరుకోలేని దెబ్బ తగిలినట్టే. అంతర్జాతీయ విమానాలపై ఉన్న నిషేదంతో ఎయిర్ లైన్స్ అప్పుల ఉబిలో కూరుకుపోతుంది.బారతదేశంలోని విమానయాన సంస్థలు 2021 ఆర్దిక సంవత్సరంలో 4.1 బిలియన్ డాలర్ల నష్టాన్ని పొందినట్లు ఏవియేషన్ కన్సల్టెన్సీ సంస్థ తెలిపింది.కోవిడ్-19 కేసుల పెరుగుదలతో ప్రయాణ బ్యాన్ ను తీసేస్తే అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణతో ఇండియన్ ఏవియేషన్ కు ఉపశమనం జరుతుందని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.


కాని కేంద్రం ఈ ఆంక్షలు కొనసాగించటంతో నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది.ఇక ఇండియన్ వారెన్ బఫెట్ రాకేష్ జున్ జూన్ వాలా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.వచ్చే నాలుగు సంవత్సరాలలో 70 ఎయిర్ క్రాఫ్ట్లను విమానయానంలో ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి.మరి అయన పెట్టుబడులతో ఏవియేషన్ రంగం పుంజుకుంటున్దో లేదో చూడాలి.అసలే ఈ ఆంక్షలతో అంతర్జాతీయ విమాన టికెట్స్ ఉన్న దాని కంటే రొండు ఇంతలు పెరిగాయి.ఈ మధ్యనే అమెరికా లాంటి దేశాలు స్టూడెంట్ వీసాలపై ఉన్న ఆంక్షలు క్రమ క్రమంగా తగ్గిస్తుంది.కొత్తగా అంతర్జాతీయ విమానాలపై ఉన్న నిషేధాన్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ విమానాల నియంత్రణ సంస్థ చేసిన ప్రకటనతో స్టూడెంట్లకు ఇబ్బందులు తప్పవు.

మరింత సమాచారం తెలుసుకోండి: