ఇంటర్నెట్ ఉపయోగించి గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే ఏజెన్సీ ఫోన్ నంబర్ల కోసం శోధిస్తున్నా, ఇంటర్నెట్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసే నంబర్ల కోసం వెతుకున్నా మీరు ప్రమాదంలో పడినట్లే. సైబర్ నేరస్థులు ఇంటర్నెట్ లో గ్యాస్ సరఫరా చేసే ఏజెన్సీలు, గ్యాస్ సిలిండర్ బుక్ చేసే నంబర్లను మార్చేసి మోసాలకు పాల్పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ లో సైబర్ నేరస్థులు ఒక ఏజెన్సీ వెబ్ సైట్ నే హ్యాక్ చేశారు. 
 
వెబ్ సైట్ లోని సమాచారంతో సైబర్ నేరస్థులు నలుగురు వినియోగదారులను మోసం చేశారు. పోలీసులు సైబర్ నేరస్థులు ఢిల్లీ నుండి ఈ మోసాలను చేస్తున్నట్లు గుర్తించారు. కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలనుకునేవారు ఫోన్ నంబర్ల కొరకు ఇంటర్నెట్ లో వెతుకుతున్నారు. ఇంటర్నెట్ లో దొరికిన నంబర్లకు ఫోన్ చేస్తే అవతలి వైపు సైబర్ నేరస్థులు మాట్లాడుతున్నారు. సైబర్ నేరస్థులు ఫోన్ చేసిన వినియోగదారుల ఆధార్, బ్యాంక్ అకౌంట్, అడ్రస్ మొదలైన వివరాలను తీసుకుంటున్నారు. 
 
ఆ తరువాత పేటీఎం, గూగుల్ పే ద్వారా నగదు పంపితే 24 గంటల్లో గ్యాస్ సిలిండర్ పంపిస్తామని చెబుతారు. ఆ తరువాత సైబర్ నేరస్థులు వారి బ్యాంక్ అకౌంట్ల నుండి లక్షల రూపాయలు దోచేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు నారాయణగూడ, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలలో నివశించే వారు ఎక్కువమంది ఈ విధంగా నగదు పోగొట్టుకున్నారని చెబుతున్నారు. 
 
హైదరాబాద్ కు కొత్తగా వచ్చిన ఒక మహిళ ఇంటర్నెట్ లో వెతికి గ్యాస్ సిలిండర్ బుక్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేసిన సైబర్ నేరస్థుడు బుకింగ్ పద్ధతి మారిందని 20 రూపాయలు గూగుల్ పే ద్వారా పంపించాలని కోరాడు. 20 రూపాయలు పంపించిన తరువాత మీ మొబైల్ కు ఒక మెసేజ్ వస్తుందని అందులో వివరాలు నమోదు చేసి పంపాలని చెప్పాడు. వివరాలు నమోదు చేసి పంపిన 5నిమిషాల్లో ఆ మహిళ ఖాతా నుండి లక్ష రూపాయలు కట్ అయ్యాయి. బ్యాంక్ అధికారులను సంప్రదించగా బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: