ప్రధానమంత్రి నరేంద్రమోడి-జగన్మోహన్ రెడ్డి భేటి అవ్వటాన్ని చంద్రబాబునాయుడుతో పాటు ఆయనకు మద్దతిచ్చే మీడియా అస్సలు తట్టుకోలేకపోతోంది. పైగా దాదాపు గంటన్నరపాటు సమావేశం అవ్వటాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిసిపోతోంది. అందుకనే బుర్రలోకి ఏది తోస్తే దాన్ని అచ్చేసి వదిలేస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడు ఎన్డీఏలో ఉన్నపుడే నరేంద్రమోడి అపాయిట్మెంట్ ఇవ్వటానికి  ఇష్టపడలేదు.

 

మోడితో భేటికి చంద్రబాబు ఎన్నివిధాల ప్రయత్నాలు చేసినా  సక్సెస్ కాలేదు. పైగా అప్పట్లో యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న గాడ్ ఫాదర్ కూడా ఏమి చేయలేకపోయారు. అదే సమయంలో  వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి అండ్ కో కు అపాయిట్మెంట్ దొరికేది. చివరకు లక్ష్మీ పార్వతి కూడా మోడిని కలిసి ఫొటోలు దిగారు. దాంతో మోడి అంటే  చంద్రబాబు, వాళ్ళ మీడియాలో ఓ విధమైన కసి పేరుకుపోయింది.

 

మొన్నటికి మొన్న అంటే మూడు నెలల క్రితం వరకూ జగన్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా కలవని విషయం గుర్తుండే ఉంటుంది. ఎప్పుడైతే జగన్ ఢిల్లీకి వచ్చినా అమిత్ కలవలేదని తెలిసేటప్పటికి చంద్రబాబు మీడియాలో విపరీతమైన సంతోషం కనిపించేది. నిజానికి ప్రధానిగా ఎవరున్నా ముఖ్యమంత్రులుగా ఎవరున్నా కలవాల్సిందే. అలా కాదని ప్రధానమంత్రి సదరు ముఖ్యమంత్రిని కలవటం లేదంటే అది వ్యక్తులకు కాదు రాష్ట్రానికి అవమానం అన్న విషయాన్ని చంద్రబాబు మీడియా మరచిపోయింది.

 

ఈ నేపధ్యంలోనే మోడి నుండి జగన్ కు పిలుపు రావటం అదికూడా ఢిల్లీ ఎన్నికల ఫలితాల నేపధ్యంలో రావటంతో  చంద్రబాబు మీడియా తట్టుకోలేకపోయింది.  అందుకనే వీళ్ళ భేటి అయిన పది నిముషాలకే జగన్ కు మోడి అక్షింతలని, పిపిలపై అసంతృప్తి వ్యక్తం చేశారని, ప్రత్యేక హోదా గురించి అడిగినపుడు మొహం చిట్లించారనే తప్పుడు వార్తలను అచ్చేసుకుని తృప్తి పడిన విషయం అందరూ చూసిందే.  ఇద్దరి మధ్య భేటిలో ఏమాట్లాడుకున్నారన్న విషయం మూడో వ్యక్తికి తెలిసే అవకాశమే లేదు. అలాంటపుడు బుర్రకు ఏది తోస్తే దాంతో బురద చల్లేసి తృప్తి పడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: