హైదరాబాద్: చాలా రోజులు తరువాత దేశంలోని రెండుమూడు పార్టీలు మినహా అన్ని పార్టీలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ ప్రభావం బాగానే కనిపిస్తోంది. గురువారం ఉదయం నుంచీ రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. వాహనాలు తిరగకపోవడంతో జాతీయ, రాష్ర్టీయ రహదారాలు బోసిపోయి కనిపించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రంలోని యూపీఏ సర్కార్ డీజీల్, గ్యాస్ ధరలు, ఎఫ్ డీఐల అనుమతి ఇచ్చిన దరిమిలా దేశవ్యాప్త ఆందోళనకు విపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్ లో వ్యాపార, వాణిజ్య సంఘాలు కూడా పాలుపంచుకుంటున్నాయి. గురువారం జరగాల్సిన పలు పరీక్షల్ని కూడా వాయిదా వేశారు. పాఠశాలలు, కళాశాలలు కూడా బంద్ ను పాటిస్తున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలిచిపోయాయి. యూపీఏ సర్కార్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ ఎన్డీఏ భారత్ బంద్ కు పిలుపునిస్తే...దీంట్లో దేశంలోని మెజారిటీ పార్టీలతో పాటు రాష్ర్టంలోని అన్ని పార్టీలు బంద్ లో పాల్గొంటున్నాయి. రిటైల్ రంగంలో విదేశీ పెట్టబడులను నిరసిస్తూ వ్యాపార, వాణిజ్య సంఘాలు బంద్ ను పాటిస్తున్నాయి. మరోవైపు లారీలు, ట్రక్కుల యజమానులు కూడా బంద్‌కు మద్దతుగా ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేశారు. ఆర్టీసీది అదే పరిస్థితి. దాదాపుగా విపక్షాలన్నీ నిరసనలకు దిగనుండటంతో దేశవ్యాప్తంగా బంద్ తీవ్ర ప్రభావం చూపనుంది. బంద్ లో భాగంగా వామపక్ష అనుబంధ ప్రజాసంఘాల నేత్రుత్వంలోని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించాయి. స్వచ్ఛందంగా గైర్హాజరవుతారు. మొత్తానికి అన్ని పార్టీలు, అన్ని వర్గాలు కూడా బంద్ కు మద్దతు ప్రకటించడంతో బంద్ పూర్తిగా జరిగే అవకాశం వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: