భారత్ చైనా సరిహద్దుల్లో  తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల పుణ్యమా అని అటు భారత ప్రభుత్వం ఎంతో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అనే విషయం తెలిసిందే.  ఆయుధాల  విషయంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత రక్షణరంగ పరిశోధన సంస్థ డి ఆర్ డి ఓ కి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇటు కావలసిన అన్ని రకాల నిధులు విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే భారత రక్షణరంగ పరిశోధన సంస్థ కూడా శరవేగంగా ఆయుధాలను తయారు చేసి  ప్రయోగాలు నిర్వహిస్తోంది. ఇప్పటికీ ఎంతో అధునాతన టెక్నాలజీతో కూడిన క్షిపణులను అభివృద్ధి చేసింది భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ.



 కాగా ఇప్పటివరకు భారత యుద్ధ విమానాల కోసం ఎక్కువగా ఇతర దేశాల పైన ఆధార పడుతూ వచ్చింది.  వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఇతర దేశాల నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేసేది. కానీ ఇక నుంచి అలాంటి వాటికి స్వస్తి పలికేందుకు భారత్ లో యుద్ధ విమానాలు తయారు చేసేందుకు భారత్ సిద్ధం అయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తేజస్ యుద్ధ విమానాలను తయారు తెలుగు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దేశీయంగా అభివృద్ధి పరిచిన 83 తేలికపాటి తేజస్ యుద్ధ విమానాల కోసం కేంద్ర ప్రభుత్వం 48 వేల కోట్లు నిధులు  విడుదల చేస్తుంది. ఇటీవలే నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భద్రతా వ్యవహారాల కమిటీ దీనికి ఆమోదముద్ర వేయడం శుభపరిణామం అని అంటున్నారు అంటున్నారు విశ్లేషకులు.



 ఈ క్రమంలోనే 2024 మార్చి నుంచి తేజస్ యుద్ధ విమానాల సరఫరా జరగబోతున్నదని  తెలుస్తోంది. అంతేకాకుండా ఈ తేజస్ యుద్ధ విమానాల కోసం ఇప్పటికే భారత వాయుసేన టెండర్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రతి ఏటా 8 యుద్ధ విమానాలను తయారు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన హెచ్ ఐ ఎల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇక ఇది సక్సెస్ ఫుల్  గా కొనసాగితే అతి త్వరలో విదేశాలు యుద్ధ విమానాల కొనుగోలు కోసం భారతదేశం పై ఆధార పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: