తెలుగుదేశం అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటెత్తితే తాను ఎకనామిక్ స్టూడెంట్ ను అని అంటాడు కానీ, ఆయన చెప్పే లెక్కల్లో కూడికలు, తీసివేతలు కూడా సరిగా ఉండవు. తాజాగా రుణమాఫీ వ్యవహారానికి సంబంధించి ఆయన చెప్పిన లెక్కలను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. మొదటేమో ఏడాదికి 20 శాతం చొప్పున ఐదేళ్లలో రుణమాఫీ చేస్తామని బాబు స్వయంగా చెప్పారు. మరి ఆ రకంగా ముందుకు పోతారని అనుకొంటే... ప్రతిపక్ష పార్టీ ధర్నా నేపథ్యంలో బాబు మాట మార్చారు. ఇప్పుడేమో 50 వేల లోపు రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేసేస్తామని బాబు చెబుతున్నారు! మరి నిజంగా అలా చేస్తే మంచిదే. అయితే.. నిధుల కేటాయింపు మాత్రం అందుకు తగ్గట్టుగా లేదు. 50 వేల లోపు మొత్తాన్ని అంతా ఇప్పుడు రద్దు చేసేటట్లు అయితే అందుకు లభ్యతలోఉన్న నిధులు సరిపోవు! బడ్జెట్ లో ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించారు, ఇప్పుడు మరో ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించామని ప్రకటించారు. మరి ఈ పది వేల కోట్ల రూపాయలతో అంతమంది రైతుల రుణాలు ఎలా రద్దు అవుతాయి?! ఎంతమందికి రైతులకు 50 వేల రూపాయల్లోపు రుణాలున్నాయి.. వారందరి రుణభారం మొత్తం ఎంత?! అనే విషయాల గురించి బాబు క్లారిటీ ఇవ్వలేదు! మాఫీ చేసేస్తాం అన్నారంతే! మరి ఇలాంటి పొంతనలేని లెక్కలు చెబుతున్నాది స్వయంగా ముఖ్యమంత్రి వర్యులు! రుణమాఫీపై అన్నదాతలు బోలెడు ఆశలుపెట్టుకొన్నారు. మరి వారి విషయంలో చేసేదేదో చెయ్యాలి కానీ.. ఇలా తప్పుడు లెక్కలు చెప్పి మభ్యపెట్టడం ఎందుకు?!

మరింత సమాచారం తెలుసుకోండి: