ఇవాళ దేశవ్యాప్తంగా  బంద్ జరగనుంది.  బంద్‌కు 12 కేంద్ర కార్మిక యూనియన్లు, 17 లెఫ్ట్‌పార్టీలు మద్ధతిస్తున్నాయి. ఆరెస్సెస్ అనుబంధ కార్మిక సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్‌. నేషనల్  ఫ్రంట్‌ ఆఫ్ ట్రేడ్‌ యూనియన్స్‌ ..బంద్‌లో పాల్గొనడం లేదని ప్రకటించాయి..  సంస్కరణల పేరుతో...చట్టాల్సి మారుస్తున్నారంటూ బంద్‌కు పిలుపు నిచ్చాయి కార్మిక సంఘాలు.పలు డిమాండ్ల సాధన కోసం ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చిన భారత్ బంద్ సమ్మె ప్రారంభమైంది. బంద్ తో దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో వాణిజ్య కార్యకలాపాలు కూడా స్తంభించనున్నాయి.

దేశ వ్యాప్తంగా పలు బ్యాంకులు కూడా మూతపడ్డాయి. సమ్మెకు సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా అన్ని విద్యాలయాలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయిఇక తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే, లారీ, ఆర్టీసీ, ఆటో కార్మిక సంఘాలు సమ్మెకు సంఘీభావం ప్రకటించాయి.ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక చట్టాలలో సవరణలు తేవడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా వామపక్షాలు,కార్మిక సంఘాలు ఈ సమ్మె నిర్వహిస్తున్నారు. అనేక చోట్ల సమ్మె విజయవంతం అయినట్లు సమాచారం వస్తోంది.ఎపి,తెలంగాణలలో రవాణ వ్యవస్థకు ఆటంకం కలిగింది.బస్ లు తిరగడం లేదు. హైదరాబాద్ లో ఆటోలు కూడా పలు చోట్ల ఆగిపోయాయి.

బంద్ తో నిర్మానుశ్యంగా రోడ్లు


సింగరేణి లో కార్మికులు సమ్మె చేస్తుండడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి సమ్మెకు మద్దతు తెలిపారు. హైదరాబాద్ లో ఆటోలు కూడా నడపక పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగభద్రత లేని పరిస్థితుల్లో అసంఘటిత రంగంలో కార్మికులు పని చేస్తున్నారని.. వారికి భద్రత కల్పించడంతోపాటు పెన్షన్లు, కనీస వేతనంపై హామీ ఇవ్వాలని యూనియన్లు కోరుతున్నాయి.  సమ్మె వల్ల  ముఖ్యమైన సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని ధీమా వ్యక్తం కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ. ప్రభుత్వం అందుకు తగ్గ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: