టీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడు తన్నీరు హరీష్ రావు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎనలేని కృషి చేశారు. రాష్ట్రంలో తిరుగులేని నేత. అన్ని నియోజక వర్గాల్లోనూ గొప్ప పేరు తెచ్చుకున్న మంచి మనిషి ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది. హరీశ్ రావు 2004 లో తొలిసారిగా సిద్దిపేట శాసనసభ నియోజక వర్గం నుంచి శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. మొదట ప్రింటింగ్ స్టేషనరీ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఆ తరువాత అదే ఏడాది సిద్దిపేట శాసనసభ, కరీంనగర్ పార్లమెంటు స్థానాలకు ఎంపికైన కేసీఆర్ ఓ స్థానాన్ని ఒదులుకోవలసి వచ్చింది. దాంతో కేసీఆర్ సిద్దిపేట స్థానాన్ని వదులుకోవడంతో అక్కడ ఉపఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో హరీష్ రావు పోటీ చేసిన గెలిచారు. ఆ తరువాత అదే విధంగా ఓ గొప్ప నాయకుడిగా ఎదిగారు. అంతులేని ప్రజాదరణ పొందారు.
అయితే సిద్దిపేట నుంచి ఇప్పటి వరకు 6 సార్లు పోటీ చేసిన హరీష్ రావు ప్రతిసారి విజయభేరి మోగించారు. ప్రతి సారి భారీ మెజార్టీతో గెలుపొందారు. 2004 అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి 24827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిపై 58935 ఓట్లతో రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64014 ఓట్లలతో గెలిచారు. 2010 మొదట్లో యు.పి.ఎ ప్రభుత్వం 2009 డిసెంబరు 9 లో ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకియ నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్న కారణంగా నిరసన వ్యక్తం చేస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 95858 ఓట్లతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 93328 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో నీటి పారుదల, మార్కెటింగ్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2018 లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 1,18,699 ఓట్లతో రికార్డు మెజార్టీతో విజయం సాధించారు.
ప్రస్తుతం ఆయన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన నీటిపారదుల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎంతో కృషి చేశారు. రాష్ట్రంలోని నీటి సమస్యలను అరికట్టేందుకు హరీష్ రావు ఎంతో పాటుపడ్డారు. ప్రజా సేవలోనే కాకుండా ఇతర పార్టీ నేతలతో మెలిగే తీరులో కూడా ఆయనకు ఆయనే సాటి. అతడికి ప్రత్యర్థిగా పోటీ చేసేందుకు ఏ నాయకుడు ఇష్టపడరు. దేశంలోని అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో హరీష్ రావు తప్పక ఉంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: