కరోనా కారణంగా ఇప్పటి వరకు వాయిదా పడిన దేశవ్యాప్త ఉప ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఎన్నికల సంఘం రాష్ట్రాల అభిప్రాయం కోరడం జరిగింది. ఉప ఎన్నికలు జరగాల్సిన కొన్ని రాష్ట్రాలు సై అనగా మరి కొన్ని మాత్రం ఇప్పుడే వద్దు అనే అభిప్రాయాన్ని వ్యక్త పరిచినట్టు తెలుస్తుంది. దీనితో ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాలలో ఉప ఎన్నికల నగారా మోగించింది. ఎప్పుడో జరగాల్సిన ఈ ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఒడిశా తదితర రాష్ట్రాలలో ఈ నెల 13 వరకు ఎన్నికల సంఘం గడువు ఇచ్చింది.

అయితే ఇప్పుడిప్పుడే కరోనా మూడవ దఫా ప్రభావం కనిపిస్తున్న సూచనలు ఉన్నప్పటికీ ఈ తరహా నిర్ణయాన్ని తీసుకోవడం తో కేంద్రంపై మరో మారు నిందారోపణలు వచ్చే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. దేశవ్యాప్త పరిస్థితి తీసుకున్నప్పటికీ కొన్ని చోట్ల ఒక పక్క కరోనా, మరో పక్క భారీ వర్షాలతో విష జ్వరాలతో అల్లాడిపోతున్నారు ప్రజలు. ఇటువంటి పరిస్థితులలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని విపక్షాలు గొల్లు మంటున్నాయి. అయితే ఇంకా ఎంత కాలం వాయిదాల పర్వం అనేది కూడా పెద్ద ప్రశ్న. అందుకే పరిస్థితులు మరింతగా క్షిణించే లోపు ఈ ఉపఎన్నికలు కానిచ్చే ఆలోచన చేసినట్టు అధికార పార్టీ సమర్ధించుకుంటుంది.

ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. తెలంగాణాలో ఇప్పటికే అసలు సిసలు ఎన్నికల హడావుడి కంటే ఎక్కువ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ, రెండు తెలుగు రాష్ట్రాలు ఉప ఎన్నికలకు విముఖతనే వ్యక్తం చేయడం విశేషం. నిజానికి ఈ సీజన్ లో కరోనా భయం, రెండు విష జ్వరాల భయం, మూడు పండుగల వేళ ఇవన్నీ కారణాలుగా చూపి ఈ సారికి ఉప ఎన్నిక వాయిదా కోరినట్టు తెలుస్తుంది. అయితే, విపక్షాలు మాత్రం ఓటమి భయం అంటూ ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టేశాయి. ఏదిఏమైనా రెండు తెలుగు రాష్ట్రాల లో ఉన్న ప్రభుత్వాలపై మాత్రం ప్రస్తుతం నెగటివ్ వార్తలు బాగా హల్ చల్ చేస్తుండటంతో, ఈ నిర్ణయం తీసుకోని ఉండవచ్చని నిపుణుల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: