బ్రహ్మోస్ కు తొమ్మిది వేల కోట్లు  !
 భారత అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రంగా ఉన్న బ్రహ్మోస్ క్షిపణుల తయారి కేంద్రానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మంగళవారం ప్రకటించారు. గతంలో ప్రభుత్వాలు సైనికులకు అవసరమైన యుద్ధ సామగ్రిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వని, ప్రస్తుతం భారత్ ఎగుమతులే లక్ష్యంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.  త్వరలోనే భారత దేశం అయుధాలు ఎగుమతులు చేసే దేశంగా ప్రపంచ పటంలో ముందుంటుందని ఆయన తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ లోని ఆలీఘర్ లో మంగళవారం ప్రధాన మంత్రి పలు అభివృద్ధి కార్యకమాల్లో పాల్గోన్నారు. రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. పలు అంశాలపై నరేంద్రమోడి సుధీర్ఘ ప్రసంగం చేశారు. ఉత్తర ప్రదేశ్ లో నిర్మించ తలపెట్టిన పారిశ్రామిక ప్రాంతం రక్షణ కారిడార్ నమూనాను సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సంద్ర్భంగా జరిగిన సభలో ప్రసంగించారు.
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్ర కళ్యాణ్ సింగ్ ను స్మరించుకున్నారు.  ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్నిగుర్తు చేసుకున్నారు.
భారత దేశం  స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు నిర్వహించుకుంటున్న వేళ దేశంకోసం పోరాడి వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు. స్వాతంత్య్ర సమరాంగణంలో తన సర్వశక్తులు ఒడ్డి పోరాడిన రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ సేవలను కొనియాడారు. ఆలీఘర్ ముస్లి యూనివర్సిటీకి ఏ.ఎం.యు) ఆయన వేలాది ఎకరాల భుమికి దానంగా ఇచ్చారని గుర్తు చేశారు.


ఉత్తర ప్రదేశ్ కు త్వరలో ఎన్నికలు జరగనున్న సమయంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యతను సందరించుకుంది. నరేంద్రమోడి తన ప్రసంగంలో రాజకీయాలకు కూడా ప్రస్తావించారు. ఉత్తర ప్రదేశ్ లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ప్రధాని " డబుల్ ఇంజన్ గవర్మమెంట్ " అంటూ తెలిపారు. యు.పి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేరస్తులను అణి వేశారని కితాబిచ్చారు. నేరస్తులు ఎక్కువగా ఉన్న సమాజా వాదీ పార్టీ కి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆహూతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్,  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: