గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంటు సభ్యుడిగా పెర్ ఫార్మెన్స్ లో వీక్ గా కనపడుతున్నారా ? ఆయన రెండుసార్లు వరసగా గెలిచినా ఈసారి మాత్రం ఆయనకు గెలుపు విషయంలో ఆయ‌న‌కు ఇబ్బందులు తప్పవా ? ఆయ నో పార్ట్ టైం పార్లమెంటు సభ్యుడిగా ఉంటున్నారా ? అంటే అటు టీడీపీ లోనూ.. ఇటు ఆయ‌న ఎంపీగా ఉన్న గుంటూరు పార్ల‌మెంటు ప్రాంతం ప‌రిధిలోనూ ఇవే ఆన్స‌ర్లు వినిపిస్తున్నాయి. అయితే ఆయ‌న్ను టీడీపీ వ‌దులు కుంటుంద‌ని కూడా అనుకోలేం. ఆయ‌న ఇప్ప‌టికే రెండు సార్లు ఎంపీగా గెలిచారు. పైగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని లా అస‌మ్మ‌తి స్వ‌రాలు ఏం వినించే మ‌నిషి కాదు.. పైగా పారిశ్రామిక వేత్త‌, రేప‌టి ఎన్నిక‌ల లో పార్టీని ఆర్థికంగా ఆదుకునే అవ‌కాశాలు కూడా ఉన్నాయి.

అందుకే ఈ సారి గ‌ల్లా జ‌య‌దేవ్ సీటు మారుస్తారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీకి కంట్లో న‌లుసులా మ‌రిన విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని ని ఈ సారి ప‌క్క‌న పెట్టేస్తార‌ని అంటున్నారు. అయితే నానిని ఏ పెన‌మ‌లూరో లేదా మ‌రో చోట నుంచో ఎంపీగా పోటీ చేయిస్తార‌ని... నానికి ఈ సారి మాత్రం విజ‌య‌వాడ ఎంపీ సీటు ఇవ్వ‌రనే అంటున్నారు. మ‌రో టాక్ ఏంటంటే నాని ఈ సారి త‌న‌కు తానుగా  తాను వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ఎంపీగా పోటీ చేయ‌న‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఇక జ‌య‌దేవ్ పై గుంటూరు పార్ల‌మెంటు ప‌రిధిలో ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. ఆయ‌న ఎంపీ గా గెలిచినా ఎవ్వ‌రికి అందు బాటులో ఉండ‌డం లేద‌ని అంటున్నారు. దీంతో గల్లా జయదేవ్ ను ఈసారి బెజవాడ పార్లమెంటుకు పోటీ చేయించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి బాబు ప్ర‌తి పాద‌న‌కు జ‌య‌దేవ్ ఏం చెపుతారో ?  ఏం జ‌రుగుతుందో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: