ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు నేడు. రాష్ట్ర ప్రజలు పండగ వాతావరణం లో ఉంటే టీడీపీ నాయకులు ఇంట్లో ఉంటూ కడుపు మంటతో అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు అంటూ ఏద్దేవా చేశారు. యనముల రామకృషుడు ఆర్ధిక శాఖ ను ఏనాడు సవ్యంగా నిర్వహించలేదు అని అన్నారు.. టీడీపీ ప్రభుత్వం లో మీరు అప్పు తేలేదా.? అని ప్రశ్నించారు. తెచ్చిన అప్పును ఏం చేశారు అని నిలదీశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తాను అన్నారు జగన్ ..అదే విధంగా అమలు చేస్తున్నారు అని స్పష్టం చేశారు.

కష్ట కాలం లో కూడా ముఖ్యమంత్రి జగన్ పేదవారి ఖాతాలు లోకి డబ్బులు వేస్తున్నారు అని చంద్రబాబు, యనముల రామకృషుడు రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అంటూ విమర్శించారు. అమ్మఒడి పథకాన్ని విమర్శిస్తున్నారు యనమల అని మండి పడ్డారు మంత్రి . అ టీడీపీ ప్రభుత్వం లో విద్య కోసం ఏనాడు అయిన ఆలోచించారా అని ప్రశ్నించారు. పైగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెడతాం అంటే కోర్టు లో కేసులు వేశారు అన్నారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు జగన్ అమలు చేస్తున్నారు అని దేశం లో అత్యున్నతంగా డి బి టి అని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ అంటూ కొనియాడారు. చంద్రబాబు ఇంకా ఎంత కాలం పిట్ట కథలు చెప్పుకొని బ్రతుకుతారు అని ప్రశ్నించారు.

బొగ్గు నిల్వలు తగ్గడం వలన కరెంటు కష్టాలు వచ్చాయి అని కరెంటు కోసం చంద్రబాబు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది అన్నారు. గత ప్రభుత్వం లో ఉన్న 8500 కోట్ల రూపాయలు కరెంటు బకాయిలను జగన్ తీర్చారు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం లో లిక్కర్ రేటు పెరిగాయి అని అయ్యన్నపాత్రుడు బాధపడుతున్నారు అని ఎవరైనా నిత్యావసర సరుకుల ధరలు పెరిగితే బాధపడతారు కానీ టీడీపీ నాయకులు లిక్కర్ ధరలు పెరిగితే బాధపడుతున్నారు అని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp