అదే చంద్రబాబుకు మైనస్సా ?

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఎలా ఉంటుంది ? ఎవరెవర్ని కలుస్తారు ? ఏం చెబుతారు ? ఇలాంటి ప్రశ్నలన్నీ గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో విరివిగా వచ్చేవి. ప్రస్తుతం ఆ స్పందన , ఆ ఉత్సుకత ప్రజల్లో కనపడడం లేదు. ఇందుకు కారణాలు అనేకం. అధికారంలో లేరు కనుక ఎవరూ పెద్దగా పట్టించుకొని ఉండక పోవచ్చు. రాష్ట్రంలో ప్రజలు కూడా చంద్ర బాబు నాయుడు దీక్ష పై పెద్దగా క్షేత్ర స్థాయిలో చర్చలు జరగ లేదు. అధికార , ప్రతిపక్షాలు ప్రతి నిత్యం వాదులాటల్లో ఉండటం, చివరకు దాడులకు తెగపడడటం అన్నీ చూసి చూసి విసిగి వేసారి పోయారు జనం. దేశమంతా కరెంటు కష్టాలతో ఉంటే , వాటిని తప్పించి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ ఉండటాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.
చంద్ర బాబు నాయుడు తో సమావేశం కావడానికి కేంద్రంలోని పెద్దలు సుముఖంగా లేరని ఢిల్లీ  రాజకీయ వర్గాల సమాచారం. గతం లో అంటే, చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్న హయాంలో  సి,బి ఐ లాంటి కేంద్ర సంస్థలు  ఆంధ్ర ప్రదేశ్ లో విచారణ చేపట్టడానికి వీలులేదని  ఓ ఆర్డర్ వేశారు. అదే ప్రస్తుతం ఆయనకు గుదిబండగా మారింది. రెండు మూడు రోజుల క్రితం కేంద్ర దర్యాప్తు సంస్థల ను అడ్డుకునే అధికారం రాష్ట్రాలకులేదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం అధికారాలను ప్రశ్నిస్తున్నందునే నేడు చంద్ర బాబుతో సమావేశం కావడానికి ఢిల్లీ పెద్దలు అంత గా సుముఖత వ్యక్తం చేయడం లేదు.
అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా చంద్ర బాబు నాయుడు సేవలందించిన కాలంలో  కేంద్రం పెత్తనాన్ని సహించని ఆయన ఏకంగా ఓ ఉత్తర్వును వెలవరించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు  ఆంధ్ర ప్రదేశ్ లో నేరుగా జోక్యం చేసుకోరాదని  జీవో విడుదల చేశారు. నాడు దీనిపై దేశ వ్యాప్త చర్చ జరిగింది.  ఇది జరిగిన కొద్ది నెలల్లో  పశ్చమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఇదే రకమైన ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్ ప్రదేశ్ ను నాడు ఢిల్లి పెద్దలు పెద్దగా పట్టించుకోక పోయినా , కోంత కాలం తరువాత పశ్చిమ బంగాల్ పై మాత్రం దృష్టి పెట్టారు. ఈ వారంలో కేంద్ర ప్రభుత్వం కీలక మైన ఆదేశాలు వివిధ రాష్ట్రాలకు పంపించింది. ఇది నాడు చంద్ర బాబు నాయుడు, ఆ తరువాత మమతా బెనర్జీలు ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించినది కావడం విశేషం. పశ్చిమ బంగాల్ ఎన్నికలు ముగిసాక ఈ ఉత్తర్వులు వెలవడ్డాయి.  సిబిఐ ని నిరోధించే అధికారం రాష్ట్రాలకు లేదన్నది ఆ ఉత్తర్వుల సారాంశం. దేశ వ్యాప్తంగా ఉన్న అంశాలు, వివిధ ప్రభుత్వ ఉద్యోగుల పై విచారణాధికారం సిబిఐకి ఉందని కేంద్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కోనింది.
సిబిఐ విచారణతో పాటు, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఆంధ్ర ప్రదేశ్ లో అనుమతి నిరాకరించిన చంద్ర బాబు నాయుడు కు కేంద్రంలో పెద్దలు నేడు నో అపాయింట్ మెంట్ అంటున్నారు.










మరింత సమాచారం తెలుసుకోండి: