ఒవైసీ అధినేత అసదుద్దీన్ తన రాజకీయ వ్యూహాలను మార్చేశారు. ఇప్పటి వరకు తమ మతం పట్ల మాత్రమే దృష్టి పెట్టిన ఆయన దానిని పూర్తిగా సాధించారు. అయితే ఇంకా రాజకీయ ప్రతిష్ట అవసరం కాబట్టి, కేవలం వాళ్ళ మత ఓట్లు సరిపోవు కాబట్టి వేరే వైపు కూడా తన ఆలోచనలు మళ్లిస్తూ, అందరితో కలిసి పోవడానికి సిద్ధం అవుతున్నారు. అందుకే ఇటీవల పాక్ కు, ఇతర ఇస్లాం మత ఛాందస వాసులపట్ల వ్యతిరేక భావాలను వ్యక్తం చేస్తూ అందరిని కలుపుకుపోవడానికే చూస్తున్నారు. పాకిస్తాన్ సహా తాలిబన్ లను గుర్తించేది లేదని ఆయన ఇటీవల ఇచ్చిన స్టేట్ మెంట్ ఆయన రాజకీయ వ్యూహాలను మార్చిందని అర్ధం అవుతుంది.

ఈ విధమైన మార్పు అటు రాజకీయాలలోనే కాకుండా సాధారణంగా ఆయనలో వచ్చిన మార్పు అయితే అది ఆహ్వానించదగినదే అవుతుంది. ఇప్పటికైనా ఇలాంటివి వ్యతిరేకిస్తూ, మతఛాందసవాదులకు తమకు పూర్తిగా బేధం ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. ఇక పాక్ వ్యవహారంలోనూ ఆయన కనీస విలువలు పాటించని వారితో ఆటలు అయినా ఆడటం అనవసరం అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం ఇమ్రాన్ ఖాన్ కేవలం ఒక మ్యాచ్ లో గెలిచినందుకే చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుబట్టారు, పాక్ వ్యవహార శైలి ఇక మారదు, వారిలో మార్పు ఆశించడం శుద్ధ దండగ అన్నట్టు అసదుద్దీన్  అభిప్రాయం వ్యక్తం చేశారు.  

అలాగే తాలిబన్ ల దేశం ఆవిర్భవించిన తరువాత దేశంలో కూడా స్థానికంగా ఇస్లాం మహిళలపై జరుగుతున్న కొన్ని దుశ్చర్యలను ఆయన తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. ఈవిధమైన మార్పు స్వాగతించాల్సి ఉంటుంది. గతంలో ఒవైసీ తమ ప్రాంతం వారు అంటే గిరి గీసుకొని జీవించేవారు, ఇప్పుడు కాస్త లౌక్యం తెలుసుకొని, అందరిని కలుపుకుపోవడానికి సిద్ధం అయినట్టే తెలుస్తుంది. అయితే దీనివెనుక కేవలం రాజకీయ లబ్ది మాత్రమే ఉన్నప్పటికీ, మరో రకంగా చూస్తే ఈ మార్పు ఒవైసీ ని భారత సమాజంలో కలిసిపోయేందుకు దాదాపు సిద్ధం చేస్తుంది. ఇప్పటి వరకు తమలో తామే అన్నట్టుగా ఉన్న వారు ఇకమీదట కలిసి మెలిసి ప్రయాణించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: