దేవదాయ శాఖ ఉన్నతాధికారులు తో మంత్రి వెలంపల్లి సమీక్ష నిర్వహించారు నేడు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కీలక మార్పులు తెచ్చాం అని ఆయన చెప్పుకొచ్చారు. ఆలయ భూముల లీజులు ఎగ్గొట్టే వారిపై చర్యలు తీసుకుంటున్నాం అని ఆయన స్పష్టం చేసారు. అన్ని విభాగాల్లో పూర్తి పారదర్శకత పాటిస్తున్నాం అన్నారు మంత్రి. రాబోయే రోజుల్లో విజిలెన్స్ విభాగాన్ని మరింత పటిష్టం చేస్తామని ఆయన స్పష్టం చేసారు. దేవాలయాల అభివృద్ధికి నాడు-నేడు కార్యక్రమం చేపడతాం అని అన్నారు మంత్రి వెలంపల్లి.

 దేవదాయ శాఖలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పారు. సీసీ కెమెరాలు రాబోయే రెండు నెలల్లో 100 శాతం ఫిక్స్ చేస్తాం అని అన్నారు. ప్రతి ఆలయంలో గోశాల ను ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేసారు. హిందువుల మనోభావాలకు తగ్గట్టుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం అని అన్నారు. గత ప్రభుత్వం కూల్చివేసిన 9 ఆలయాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్న మంత్రి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా దేవాదాయ శాఖపై కనీసం పూర్తి స్థాయి రివ్యూ చేయలేదు అని పేర్కొన్నారు.

ఇక దేవాదాయ శాఖా ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్ కూడా మీడియాతో మాట్లాడారు. భక్తులు కేంద్రంగా ఆలయాలు అభివృద్ధి చేస్తాం అని అన్నారు. దేవాలయాలు,దేవతా మూర్తుల ప్రాశస్త్యం వివరించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆలయాల్లో సెక్యూరిటీ బలోపేతంపై దృష్టి పెట్టాం అని పేర్కొన్నారు. 175 ఆలయాల్లో ఆన్ లైన్ సేవలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. డోనేషన్లు నేరుగా టెంపుల్ ఖాతాలోకి వెళ్లేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ధర్మ పదం కార్యక్రమం విజయవంతంగా చేపడుతున్నాంఅని స్పష్టం చేసారు. ప్రతి ఆలయంలో ఆభరణాల వివరాలు డిజిటలైజ్ చేస్తున్నాం అని పేర్కొన్నారు. కాగా ఏపీలో విపక్షాల విమర్శలకు అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు దిగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap