తెలంగాణలో ఉపఎన్నికలు రేవంత్ పదవికి గండంగా మారాయి. ఇటీవలే ఆయన టీపీసీసీ పదవి దక్కించుకున్నాడు. అనంతరం రాష్ట్రంలో కనీసం ఉపఎన్నికలో గెలిచి ఆ సీటును అధిష్టానానికి బహుమతిగా ఇద్దాం అనుకున్నాడు. కానీ అన్ని అడియాసలే అయ్యాయి. దీనితో ఇప్పుడు ఆయనకు కొత్త చింతలు పట్టిపీడిస్తున్నాయి. అధిష్టానం తన పదవి ఉంచుతుందా, ఊడపీకేస్తుందా అనేది ఇక్కడ పెద్ద అంశం. తెలంగాణాలో ఎందరో కాంగ్రెస్ సీనియర్లను వద్దని బుడ్డోడు రేవంత్ కు అధిష్టానం రాష్ట్ర అధ్యక్ష పదవి ఎలా ఇస్తుంది అనేది వాళ్ళ ప్రశ్న. ఇది కాంగ్రెస్ లో మొదటి నుండి ఉన్న రచ్చే. కాకపోతే రాహుల్ వచ్చినప్పటి నుండి యువత పాట పాడుతుండటంతో, రేవంత్ కి అవకాశం దక్కి ఉండవచ్చు.

ఆ పదవికి ఇప్పుడు రాజీనామా చేస్తాడా లేదా అధిష్టానం వాళ్ళే పీకేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏది జరిగినా మళ్ళీ రేవంత్ పరిస్థితి కుడితిలో పడిన ఎలక లాగా, కేసులు కోర్టులు అంటూ తిరగాల్సి వస్తుంది. అదే జరిగితే ఇప్పటివరకు అనుభవించినదంతా వృధా అవుతుంది. ఇలాంటి మానసిక మధనం రేవంత్ కు తప్పదు. ఎన్నాళ్ళు అంటే చెప్పడానికి కుదరదు. సోనియమ్మ మళ్ళీ పిలిస్తే అప్పుడేమైనా ఈ సంగతి తెలియరావచ్చు. అధిష్టానం కూడా ఈ మాత్రం ఫలితం ఆశించకుండానే రేవంత్ కు పదవి కట్టబెడుతుందా, కేవలం ఇదొక ట్రయల్ అంతే. పాస్ అయితే అదిరిపోద్ది అనుకుంది అధిష్టానం, లేదంటే షరా మాములే.

ఉత్తర ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ గెలవచ్చుగాక, తెలంగాణాలో మాత్రం కుదరని పరిస్థితి. ఎక్కడ కాంగ్రెస్ కు వ్యతిరేక పవనాలు ఉన్నాయి అనేది బీజేపీ క్షుణ్ణంగా పరిశీలించిన పిదప మాత్రమే అక్కడ జెండా పాతుతుంది. తెలంగాణాలో కూడా అదే చేసింది. ఇక ఇక్కడ అప్పుడే కాంగ్రెస్ రావడం కలే. ఇవన్నీ అధిష్టానానికి కూడా తెలుసు, మరి అలాంటి స్థానంలో ఎవరు అధ్యక్షుడిగా ఉంటె ప్రయోజనం ఉంటుంది, అందుకే రేవంత్ కు అది కట్టబెట్టారు. ఏదో బలిచేదాకా మేకను అలంకరించినట్టుగా అంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: