ఎన్టీఆర్ వర్శిటీ నిధులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి బదలాయించే అంశం పై ఈసీ సమావేశం లో కీలక నిర్ణయం తీసుకున్నారు. బిడ్డింగ్ ద్వారా రావాలని ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వానికి, ఫైనాన్స్ సర్వీసెస్ కార్పోరేషను కు ఈసీ సూచనలు చేసినట్లు సమాచారం అందుతోంది.  ఇతర బ్యాంకుల కంటె ఎక్కువ వడ్డీ ఇస్తేనే వర్శిటీ నిధులు ఫైనాన్స్ సర్వీసెస్ కార్పొరేషనుకు నిధులివ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.  శ్యామ్ ప్రసాద్, వీసీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. వర్శి టీ లో అదనంగా ఉన్న నిధులు బదలాయించమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వం అడుగుతున్నట్లు మనకు సమాచారం అందుతోంది.  ఫైనాన్స్ సర్వీసెస్ కార్పొరేషన్ను కూడా ఇతర బ్యాంకుల తో కలిపి బిడ్డింగులో పాల్గొనమని చెబుతామనీ పేర్కొన్నారు. ఈ మేరకు దీని పై ఈసీ లో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. 

బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తే ఫైనాన్స్ సర్వీసెస్ కార్పొరేషనుకు నిధులిస్తామనీ పేర్కొన్నారు తెలుస్తోంది.  ప్రస్తుతం వర్సిటీ డిపాజిట్లకు రూ. 5.10 మేర వడ్డీ వస్తోందని సమాచారం అందుతోంది. 6 బ్యాంకుల్లో వర్శిటీ నిధులు డిపాజిట్ చేశారాణి తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంకు అనుమతి తో ఏపీ ఫైనాన్స్ సర్వీసెస్ కార్పొరేషన్ ఏర్పాటైందని తెలిపినట్లు సమాచారం అందుతోంది. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నెల రోజులుగా ఏడెడ్ విద్యాసంస్థల వివాదం చెలరేగిన సంగతి మనందరికీ విధితమే.

ఈ విద్యాసంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు మనందరికీ తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికీ ఈ వివాదం చెలరేగుతూనే ఉంది. ఇక మొన్న అనంతపూర్ జిల్లాలో విద్యార్థులపై లాఠీచార్జీ కూడా జరిగిన సంగతి మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక విద్యార్థుల తరపున అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పోరాటం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

AP