ఎప్పటికప్పుడు రాజకీయ వ్యూహాలను మారుస్తూ ప్రత్యర్థులకు ముకుతాడు వేసే గులాబీ అధినేత ఇప్పుడు సొంత పార్టీ నేతలను కూడా కంగారు పట్టిస్తున్నారట. బ్లాక్ లిస్ట్ ఒకటి బయట పెట్టి గూబులు గులాబీ నేతలను వెంటాడుతున్నారట.సర్వే ద్వారా పనితీరుపై ఓ అంచనాకు వస్తున్న అధినేత కొందరు సిట్టింగులకు చెక్ పెట్టబోతున్నారట. ఎన్నికల సమయం వచ్చేసరికి ఓ క్లారిటీకి రాబోతున్నారట. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరు వణుకుతున్నారట. గులాబి కోటలో నాయకులకు కొత్త ఫీవర్ పట్టుకుందట. కూడికలు తీసివేతలు కసరత్తు జరుగుతుందట.

 వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించే వారి జాబితా పెరిగిపోవడంతో గులాబీ అధినేత వడపోత కార్యక్రమం పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో గులాబీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరికి గుబులు పట్టుకుందట. సిట్టింగ్ లకే తిరిగి టికెట్ అంటూ పైకి ఏదో చెప్తున్నా ఇంటిపోరుతో సిట్టింగులు సతమతమవుతున్నారట. మరోవైపు కేసీఆర్ సర్వే సిట్టింగుల్లో గుబులురేపుతోందట. ప్రస్తుతం మారుతున్న రాజకీయాలతో కెసిఆర్ మరోసారి సర్వే జరిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సర్వేలో పాస్ అయితేనే టికెట్, లేదంటే పార్టీలో,ప్రత్యర్థి లో  ఎవరో ఒకరికి లేదా ఔత్సహికుడికి టికెట్ చేజారి పోతుందనే బెంగ సిట్టింగుల్లో కనిపిస్తోందట. బ్లాక్ లిస్టులో 20 మంది వరకు ఎమ్మె ల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది.

 సర్వేలు వివిధ వర్గాల ద్వారా తెప్పించు కుంటున్న సమాచారం, నిఘా విభాగాల నివేదికలతో ప్రజలకు దగ్గరగా ఎవరుంటు న్నారు, వచ్చే ఎన్నికల్లో వారి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయన్న అంశాలపై గులాబీ దళం అధినేత దృష్టి సారించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సర్వే ద్వారా సేకరించిన సమాచారంతో వివిధ నియోజకవర్గాల్లో ప్రత్యా మ్నాయ నేతలను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లందరికీ టికెట్లు లభిస్తాయని గులాబీ అధినేత ఎంత హామీ ఇస్తున్నా కొన్ని నియోజ కవర్గాల్లో మార్పులు తప్పనిసరి అని గులాబీ కోట లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: