బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలొస్తే పండుగ చేసుకుంటుంది ఇండ‌స్ట్రీ. గోదావ‌రి జిల్లాల‌లో అయితే ఇంకా పెద్ద పండుగే జ‌రుగుతుంది కూడా!
అయితే పుష్ప సినిమా విజ‌యం అన్న‌ది సుక్కూ కు కాన్ఫిడెన్స్ ఇవ్వ‌డ‌మే కాదు మ‌రింత న‌మ్మ‌కంతో ముంద‌డుగు వేసేలా కూడా చేసింది. త‌న సినిమాను ఆద‌రించిన ప్రేక్ష‌క లోకానికి ధ‌న్య‌వాదాలు చెబుతూనే కొంద‌రి శ్ర‌మ జీవుల‌కు ఓ గౌర‌వం ఇవ్వాల‌న్న త‌లంపుతో సుక్కూ ఓ నిర్ణ‌యం తీసుకుని, మాన‌వ‌త‌కు మంచి నిద‌ర్శ‌నం అయ్యారు.

లాభాలొస్తే పంచే నిర్మాత‌లు అరుదు. న‌ష్టాలొస్తే ఆదుకునే వారే అరుదు. లాభ న‌ష్టాలు ఎలా ఉన్నా కూడా ఇండ‌స్ట్రీలో త‌మ వంతు సాయం చేయ‌డం కూడా చాలా అరుదు. కానీ ఇప్ప‌టిదాకా త‌న కెరియ‌ర్ లో అరుదైన ఎన్నో విజ‌యాలు అందుకున్న సుక్కూ తొలిసారి ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. త‌న సినిమా అన్ని భాష‌ల్లోనూ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తున్న త‌రుణంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని ఇండ‌స్ట్రీలో మ‌రో మారు టాక్ ఆఫ్ ద ప‌ర్స‌న్ అయ్యారు.

వాస్త‌వానికి ఒక సినిమాకు ప‌డే క‌ష్టం ప‌దే పదే గుర్తుకు తెచ్చుకునే వారే అరుదు. చేసుకున్నా కింది స్థాయి వారిని గుర్తించి గౌర‌వం అందించడం అన్న‌ది కూడా అరుదు. కానీ సుక్కూ త‌నదైన స్టైల్ లో ఓ సినిమా మేకింగ్ కు ఎంతో ఎఫెర్ట్ ఇస్తారు. టెక్నీషియ‌న్ల‌ను గౌర‌విస్తా రు. ఆర్య సినిమా విష‌యంలో కూడా ఇదే చేశారు. సినిమా హిట్ కాగానే త‌న అసిస్టెంట్ డైరెక్ట‌ర్లంద‌రికీ బైక్స్ కొని ఇచ్చి వారిని స‌ప్రైజ్ చేశారు. త‌రువాత కూడా త‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే వారిని ఏదో ఒక విధంగా ఆదుకుంటూనే  వ‌చ్చార‌ని స‌మాచారం. ఇప్పుడు పుష్ప సినిమా విష‌యంలో మ‌రోసారి త‌న ఔదార్యం చాటారు. ఈ నేప‌థ్యంలో సినిమాకు ప‌నిచేసిన సెట్ బోయ్స్ కు, లైట్ బోయ్స్ కు ఒక్కొక్క‌రికి ల‌క్ష రూపాయ‌ల చొప్పున ఇవ్వాల‌ని నిర్ణ‌యించి గొప్ప మ‌న‌సు చాటారు.

ఇక సినిమా ప‌రంగా పుష్ప క‌లెక్ష‌న్లు అన్న‌వి అనూహ్యంగా ఉన్నాయి.
Week 1: ₹26.91 crore nett

Day 8 (2nd Friday): ₹2.31 crore nett

Day 9 (2nd Saturday): ₹3.75 crore nett

Day 10 (2nd Sunday): ₹4.25 crore nett

Day 11 (2nd Monday): ₹4.25 crore nett

Total (4 days): ₹39.97 crore nett

Pushpa World Wide Box Office

CROSSES ₹175 cr mark in just 9 days.

Week 1 - ₹ 166.82 cr

Week 2

Day 1 - ₹ 5.22 cr

Day 2 - ₹ 7.10 cr

Total - ₹ 179.14 cr



 

మరింత సమాచారం తెలుసుకోండి: