ఏపీలో అధికార వైసీపీలో అసంతృప్తి జ్వాలలు క్రమక్రమంగా ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయింది. జగన్ ముఖ్యమంత్రి అయిన తొలి రోజే పార్టీలో కష్టపడిన నేతలు అందరికీ న్యాయం జరుగుతుందని ప్రకటించారు. అలాగే రెండున్నర సంవత్సరాల క్రితం మంత్రివర్గం ఏర్పాటు అయిన వెంటనే ఇప్పుడు ఉన్న మంత్రులు అందరూ రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉంటారని ... ఆ తర్వాత ఆ మంత్రుల్లో 90 శాతం మందిని మార్చేసి కొత్త వారిని తీసుకుంటామని జగన్ ప్రకటించారు.

అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యి రెండున్నర సంవత్సరాలు పూర్తయింది. మంత్రివర్గాన్ని ఎప్పుడు మారుస్తారు అని ఎంతో మంది సీనియర్ నేతలు ఎదురు చూస్తున్నారు. అయితే పార్టీ నేతల నుంచి మంత్రివర్గాన్ని మార్చే ప్రసక్తే లేదని లీకులు వస్తున్నాయి. దీంతో పార్టీ నేతల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంది.. జగన్ ను నమ్ముకొని పది సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి ఆర్థికంగా ఎంతో నష్టపోయామని వాపోతున్నారు.

అయితే ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో తమకు మంచి మంచి పదవులు వస్తాయని ఆశించినా... ఇప్పుడు తమను పట్టించుకోకపోతే తమ పరిస్థితి ఏమిటని చాలా మంది సీనియర్ నేతలు వాపోతున్నారు. మరికొందరు పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు కూడా వెనకాడటం లేదు. నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత ... మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పేరు కూడా ఈ లిస్టులో ప్రముఖంగా వినిపిస్తోంది.

కొద్ది రోజులుగా పార్టీలో తీవ్రమైన అసమ్మతి గళం వినిపిస్తున్న ఆనం తాజాగా మరోసారి తన అసంతృప్తిని బయటపెట్టారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గుముఖం పట్టినా...  లోకల్‌ మాఫియా పేట్రేగిపోతోందని ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో నమ్మకం భరోసా కల్పించాల్సిన పోలీసులే దారుణాల‌కు పాల్ప‌డుతుంటే.. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లుగుతోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఏదేమైనా ఆనం పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు రెడీగా ఉన్న ఆనం ఇలా బాంబులు పేలుస్తున్నార‌ని టాక్ .?

మరింత సమాచారం తెలుసుకోండి: