అదృష్టం ఈ దేశంలో వివేకానందుడికి పెద్ద‌గా పొలిటిక‌ల్ క‌ల‌ర్ అంటించిన వారు లేరు.. ఒక‌రో ఇద్ద‌రో బీజేపీ బ్యాగ్రౌండ్ నుంచి వివేకానంద‌ను చూసే వారున్నారు.కానీ ఆయ‌న ఆశ‌య సాధ‌న‌కు పెద్ద‌గా ప్ర‌య‌త్నించిన వారు లేరు..అయినా ఈ దేశ సంప‌ద యువ‌త అని చెప్పి,వాళ్ల కోసం ఏం చేయాలో ఆ రోజు అయినా ఆలోచిస్తే గౌర‌వ అధికార పార్టీల‌కు ఓ గొప్ప గౌరవం ముందున్న రోజుల్లో ద‌క్కుతుంది క‌నుక  ఆ ప‌ని చేయాల్సిందిగా విన్నపం..ఆ రోజైనా అంటే జ‌న‌వ‌రి 12నైనా! అంటే జాతీయ యువ‌జ‌న దినోత్స‌వం  రోజునైనా!


ఆ నందుడు చూపిన బాట గురించి వేటూరి చెప్పాడు..విన్నాను పొంగిపోయాను.. సెంట‌ర్లో ఒక విగ్ర‌హం వ‌స్తే అది ఆ ప్రాంతానికే ఓ క‌ళ.. ఓ ప్రాభ‌వం అని కూడా న‌మ్ముతాను.. దేశ రాజ‌కీయాల్లో మంచి పేరు తెచ్చుకున్న యువ ఎంపీ రామూతో స‌హా ఇత‌ర రాజ‌కీయ పార్టీ పెద్ద‌లు  కూడా వివేకానంద‌ను త‌మ ఐక‌న్ గా భావించ‌డం గొప్ప విష‌యం అనే చెబుతాను..అయితే యువ‌త‌ను స‌రైన దారిలో పెట్టేందుకు ప్ర‌భుత్వాలు ఎందుకు విఫ‌లం అవుతున్నాయి అన్న బాధ నాలో ప్ర‌తిరోజూ ఉంటుంది..వివేకానంద సేవా స‌మితి పేరిట విగ్ర‌హాల ఏర్పాటుపై ఎటువంటి అభ్యంత‌రం లేదు కానీ ఆ ఉద‌య కాల సంధ్య‌ల్లో ప్ర‌భుత్వాలు చేయాల్సిన ప‌నులు కొన్ని త‌ప్ప‌క స్మ‌ర‌ణ‌కు రావాలి అన్న‌ది నా కోరిక.


ఈ త‌రుణంలో ఈ నేప‌థ్యంలో
వివేకానందుడు అంటే మా ఊళ్లో చాలా మందికి ఇష్టం.పార్టీల‌కు అతీతంగా ఆయ‌నంటే మా నాయ‌కులకు ఇష్టం.అందుకే మా ఊరు శ్రీ‌కాకుళం న‌గ‌రంలో సూర్య మ‌హ‌ల్ జంక్ష‌న్లో కొత్త‌గా ఓ పెద్ద విగ్ర‌హం ఒక‌టి ప్ర‌తిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు జ‌ర్న‌లిస్టులు మ‌రియు సోష‌ల్ యాక్టివిస్టులు.వీరికి టీడీపీ,వైసీపీ తో స‌హా అన్ని పార్టీల నాయ‌కులూ స‌హ‌క‌రిస్తున్నారు. అన్నీకుదిరితే ఈ నెల 12న జాతీయ యువ‌జ‌న దినోత్స‌వం సంద‌ర్భంగా విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ఎంపీ రాము,ఇంకొందరు అతిథులు,వైసీపీ పెద్ద‌లు సీతారాం,కృష్ణ‌దాసు,సీదిరి అప్ప‌ల్రాజు,కిల్లి కృపారాణితో స‌హా ఇంకొంద‌రు, యువ నాయ‌కులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కొడుకు చిన్నితో  స‌హా పలువురు రానున్నారు. విగ్ర‌హ ఏర్పాటుకు కొంద‌రు దాత‌లు ముందుకు వ‌చ్చారు.. వారి పేర్లు కూడా ఇన్విటేష‌న్ లో పొందు ప‌రిచి వారికో సముచిత గౌర‌వం ఇచ్చారు. ధ‌ర్మాన రామ్ మ‌నోహ‌ర్ నాయుడు (చిన్ని) తో మ‌రో 23 మంది విగ్ర‌హ‌దాత‌లు ఉన్నారు. విగ్ర‌హావిష్క‌రణ అనంత‌రం రేప‌టి వేళ యువ‌త ఏం చేయాలో ఏ విధంగా దేశ ప్ర‌గ‌తిలో భాగం పంచుకోవాలి అన్న విష‌య‌మై యువ ఎంపీ రామూ ప్ర‌సంగించ‌నున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: