శ్రీకాకుళం జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా చేయడమే లక్ష్యమని పార్లమెంట్ సభ్యులు మరియు రహదారి భద్రతా కమిటీ అధ్యక్షులు కింజరాపు రామ్మోహన నాయుడు అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు అధ్యక్షతన రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ జాతీయ రహదారిపై శత శాతం ప్రమాదాలు నివారించుటకు చర్యలు చేపడుతున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలతో పాటు ప్రత్యేక చర్యలు చేపట్టి జిల్లాను ప్రమాద రహితంగా చేయుటకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ఆరు లైన్ల  జాతీయ రహదారి పనులు వేగంగా సాగుతున్నాయన్నాని ఆయన పేర్కన్నారు. రహదారులు ఆధునాతనం కావడంతో వాటిపై ప్రయాణ వేగం పెరగడం, ప్రమాదాలను కొని తెచ్చుకోవడం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చక్కటి సౌకర్యాన్ని ప్రయోజనకరంగా ఉపయోగించుకోవలసిన అవసరం ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కోన్నారు. ఎక్కడైతే వేగం అధికంగా ఉంటున్నాయో ఆ ప్రదేశాల్లో స్పీడ్ గన్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని... అలాగే కూడళ్ల వద్ద ఎల్ఇడి దీపాలను ఏర్పాటు చేయాలని కూడా జిల్లా అధికారులను ఎంపీ రామ్మోహన్ ఆదేశించారు. వేగ నియంత్రణకు ఆటోమేటిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్...  ఏటిఎంఎస్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో టోల్ ప్లాజాల వద్ద ప్రయాణీకులకు తాగునీటి సౌకర్యం, ఇతర సౌకర్యాలు ఏర్పాటు, వివిధ ప్రదేశాల్లో సైన్ బోర్డుల ఏర్పాటుకు పార్లమెంట్ సభ్యులు నిధులను మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రహదారి భద్రత పై ప్రతి ఒక్కరూ అవగాహన కార్యక్రమాలను విస్తృతస్థాయిలో పెంచుకోవాలని తద్వారా ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం, కుటుంబాలకు భరోసాగా నిలవాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారి నిర్మాణం పనులు వేగవంతం చేయాలని అదేసమయంలో ఇంకా చేపట్టవలసిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో అండర్ పాస్ లు అవసరం ఉందని వాటిని ఏర్పాటు చేయాలని జాతీయ రహదారి సంస్థ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి పనులు పూర్తి అయిన వెంటనే రహదారి భద్రత కమిటీ సభ్యులతో పాటు తనిఖీ చేస్తామని ఆయన చెప్పారు.

రహదారి ప్రమాదాల్లో చిక్కుకున్న వ్యక్తులకు తక్షణ సహాయం చేస్తున్న మానవతా వాదులకు ప్రోత్సాహకాలను అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రమాదంలో ఉన్న వ్యక్తులకు యుద్ధప్రాతిదికన ఆసుపత్రుల్లో చేర్పించడం, సహాయం చేయడం వలన ఒక నిండు జీవితానికి పునర్జన్మ అందించినట్లు ఉంటుందని చెప్పారు. మానవతావాదులను సముచితంగా గౌరవించడం జరుగుతుందని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: