నిర్మ‌లమ్మ ప‌ద్దు అంతా నిఖార్సైన నిరుత్సాహంతో నిండిపోయింది. ఆమె చెప్పిన‌వి చెప్పాల‌నుకున్న‌వి స‌గ‌టు భార‌తీయుడ్ని సంతృప్తి ప‌రిచేలా లేవు. అస్స‌లు ఏ రంగానికీ ఉత‌మివ్వ‌కుండా ఏం చేద్దామ‌ని ఆమె అనుకుంటున్నారో కూడా అర్థంకాక నిపుణులు త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. అన్ని వ‌ర్గాల‌కూ చుక్క‌లు చూపించి, వారికి  ఏ విధం అయిన ఊర‌ట లేకుండా చేసి ఏం సాధించాల‌ని ఆమె అనుకుంటున్నారో ? ముఖ్యంగా ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు సంబంధించి ఆమె తీసుకోబోతున్న చ‌ర్య‌లు గురించి చెప్ప‌నేలేదు. పెరుగుతున్న ధ‌ర‌లు ఓ విధంగా కేంద్రానికి మంచే చేస్తున్నాయా? అంటే వంట నూనెలు ధ‌ర‌లు పెంచి త‌ద్వారా కంపెనీల ద‌గ్గ‌ర నుంచి ప‌న్నుల రూపంలో డ‌బ్బులు పిండుకోవాల‌ని అత్యాశ‌తో ఏమ‌యినా ఉన్నారా? ఇవ‌న్నీ ఇవాళ సామాన్యుడికే కాదు కేసీఆర్ కు కూడా సందేహాలుగానే ఉన్నాయి. అందుకే ఆయ‌న కూడా సామాజిక మాధ్య‌మాల్లో స్పందించి త‌న అభిప్రాయాలు చెప్పారు.


ప్ర‌పంచం అంతా క‌రోనాతో వ‌ణికిపోతోంది.అస‌లీ జ‌బ్బు ద‌శ‌ల వారీగా వ‌స్తూ వ‌స్తూ విజృంభిస్తూ ఆర్థిక రంగాన్ని కుదేలు చేస్తోంది. ఈ ద‌శలో వైద్య‌రంగానికి ఊత‌మివ్వాలి కానీ ఇవ్వ‌లేదు.ప‌రిశోధ‌న రంగానికి ఊత‌మివ్వాలి ఇవ్వ‌లేదు.ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న బ‌డ్జెట్ లో ఏ రంగానికి  స‌రైన ప్రోత్సాహ‌కాలు లేవు. అని వాపోతున్నారు కేసీఆర్.ఆయ‌నే కాదు దేశంలో ఉన్న నిపుణులంతా ముక్కున వేలేసుకుంటున్నారు. బ‌డ్జెట్ లో ఏ ఒక్క వ‌ర్గానికీ ఊర‌ట లేక‌పోవ‌డంతో ఉస్సూరు మంటున్నారు. ఆదాయ‌పు ప‌న్నుకు సంబంధించి శ్లాబులు మారుస్తార‌ని అంతా భావించినా అది కూడా ప‌ట్టించుకోలేదు గౌర‌వ ఆర్థిక మంత్రి. ఇదే విష‌యాన్ని కేసీఆర్ కూడా రైజ్ చేస్తున్నారు.


బ‌డ్జెట్లో  రైతుల‌ను ఆదుకోలేదు.వారికి చేయాల్సిన సాయం చేయలేదు. పైగా ఎరువులు ధ‌ర‌లు పెర‌గ‌బోతున్నాయ‌న్న ఇండికేష‌న్ అయితే ఇచ్చారు. ఇదీ కేసీఆర్ చెబుతున్న ఆవేద‌న‌కు అక్ష‌ర రూపం.ఇంకా బడ్జెట్ కార‌ణంగా కొత్త గా ఒన‌గూరే ప్ర‌యోజ‌నాలేవీ లేవని కూడా తేలిపోయింది. దీన్నొక ప‌నికిమాలిన బ‌డ్జెట్ గా తాను చూస్తున్నాన‌ని కేసీఆర్ అంటున్నారు.పార్ల‌మెంట్ లో ఇవాళ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ అన్న‌ది సామాన్యుడికి కాదు క‌దా ఏ రంగానికి ఉప‌యోగ‌ప‌డ‌దు అని తేలిపోయింది. అస‌లు ఏ రంగానికీ ఊత‌మివ్వ‌ని బ‌డ్జెట్ ఇదేన‌ని తేలిపోయింది. ఈ నేప‌థ్యంలో  తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ సాయంత్రం ప్రెస్మీట్ పెట్టి కేంద్రంపై నిర‌స‌న తెల‌ప‌నున్నారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌నొక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.ద‌శ,దిశ నిర్దేశం లేని బ‌డ్జెట్ ఇది అని అంటూ కేసీఆర్ ఫైర్ అవుతున్నారు. దీన్నొక గోల్ మాల్ బ‌డ్జెట్ గానే అభివ‌ర్ణించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: