బీజేపీ చీఫ్ సోమువీర్రాజులో రోజు రోజుకు భయం పెరిగిపోతున్నట్లుంది. ఆ భయం ఏమిటంటే మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ తమనుండి విడిపోతారోని. అందుకనే పదే పదే వచ్చే ఎన్నికల్లో తమ రెండుపార్టీలు కలిసే పోటీచేస్తాయని చెబుతున్నారు. మిత్రపక్షాలన్నాక కలిసే ఉంటారు, కలిసే పోటీచేస్తారనే అనుకుంటారు. కానీ వీర్రాజు మాత్రం తమరెండుపార్టీలు కలిసే ఉంటాయని, కలిసే పోటీచేస్తాయని ఎందుకని ఇన్నిసార్లు చెబుతున్నట్లు ?





తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ఎవరు అడగకుండా వీర్రాజు మళ్ళీ ఇదే విషయాన్ని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. పనిలో పనిగా చంద్రబాబునాయుడుతో పొత్తు పెట్టుకుంటారని పవన్ కల్యాణ్ పై జరుగుతున్నదంతా దుష్ప్రచారమే అంటు మండిపోయారు. టీడీపీతో పొత్తు పెంటుకుంటామని పవన్ ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదన్నారు. చంద్రబాబు-పవన్ పొత్తంతా మీడియా సృష్టే అంటు చివరకు మీడియా మీదే మండిపోయారు. పవన్ చెప్పిన మాటలనే మీడియా ప్రస్తావించినా వీర్రాజు మండిపోతుండటమే విచిత్రంగా ఉంది. 





పార్టీ ఆవిర్భావసభలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని పవన్ చేసిన ప్రకటనకు అర్ధమేంటి ? అని అడిగిన ప్రశ్నకు మాత్రం వీర్రాజు సమాదానం ఇవ్వటంలేదు. మొత్తంమీద పార్టనర్ విషయంలో వీర్రాజుకు రోజు రోజుకు భయం పెరిగిపోతున్నట్లుంది. నిజానికి రెండుపార్టీలు కలిసిపోటీచేసినా జరిగే అద్భుతం ఏమీ ఉండదనే చెప్పాలి. ఎందుకంటే రెండుపార్టీలు కలిసినా 175 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను పెట్టేంత సీన్ లేదు.






ఇదే సమయంలో బీజేపీకి అసలు ఓటు బ్యాంకేలేదు. జనసేనకన్నా మొన్నటి ఎన్నికల్లో సుమారు 6 శాతం ఓట్లొచ్చాయి. బీజేపీకైతే నోటాకన్నా తక్కువే వచ్చాయి. దాంతో బీజేపీ సీన్ ఏమిటో తెలిసిపోతోంది. తమకున్న సీనేంటో వీర్రాజుకు బాగా తెలుసుకాబట్టే పార్టనర్ ఎక్కడ చేజారిపోతారో అనే టెన్షన్ పెంచేసుకుంటున్నారు. నిజంగానే పవన్ గనుక బీజేపీని వదిలేస్తే కమలంపార్టీ పరిస్ధితి మరింత దయనీయంగా తయారైపోతుంది. అసలు ఏముంది గనుక దయనీయంగా మారిపోతుందనుకోవటానికి ? అనంటారా ? అదీ నిజమే లేండి.

మరింత సమాచారం తెలుసుకోండి: