వేసవి కాలం వచ్చింది. సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో ఈ సారి ఎండలు తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అందులోనూ రానున్న మే , జూన్ నెలలలో ఉష్ణోగ్రతలు ఇంకా పెరగనున్నాయి అని తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ లో అధిక ఉష్ణోగ్రత కొనసాగుతూనే ఉంది. మరో అయిదు రోజుల పాటు ఇదే ఉష్ణోగ్రత కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా ప్రస్తుత ఉష్ణోగ్రత వివరాలకు వస్తే... దేశంలో చాలా చోట్ల ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌ను తాకుతూ కాక పెడుతోంది. మరో అయిదు రోజుల పాటు ఆయా ప్రాంతాలలో అదే ఉష్ణోగ్రత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాయువ్య భారతంలో వాతావరణ పరిస్థితులను బట్టి మరో ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రత ఇదే స్థాయిలో కొనసాగవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.

వాతావరణ నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు ప్రముఖ వార్తా సంస్థ వివరించింది. దాంతో ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. ఈ మండే ఎండలను తట్టుకోలేకపోతున్నారు. ఇక తప్పనిసరి పనుల కోసం ప్రణాళికలు వేసుకుంటున్నారు.  ఉదయం 9 గంటల నుంచి ఎండలు మండిపోతుండటంతో చాలా మంది ప్రజలు తమ తమ పనులను ఉదయం లేదా సాయంత్రం చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అత్యవసరమైతే తప్ప జనాలు పెద్దగా బయటకు రావడం లేదు.  వాయువ్య భారతంలో ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్‌ను కూడా తాకే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్న నేపథ్యం లో ప్రజలు అప్రమత్తం అయి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ముఖ్యంగా చిన్నారులు, వృద్దల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని అంటున్నారు. అదే కాకుండా మే నెల మొదటి వారం లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు ముందుగా అప్రమత్తం అయి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: