కేంద్రప్రభుత్వం కేసీయార్ కు పెద్ద షాక్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వటం కుదరదని తేల్చిచెప్పేసింది. తెలంగాణా ఏర్పాటైన తర్వాత కేసీయార్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే, పరిపాలనా, ఆర్ధికపరమైన అనుమతులు  లేకుండానే నిర్మాణం ప్రారింభించి పూర్తిచేసేశారు. ఒకవైపు ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయహోదా ఇచ్చింది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా హోదా ఇవ్వాల్సిందే అని కేసీయార్ అండ్ కో పదేపదే కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.





తాజాగా కేంద్రం-రాష్ట్రం మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కేసీయార్ పదే పదే ఈ డిమాండ్ పై స్వరాన్ని పెంచుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్  రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానమిస్తు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చేది లేదని తేల్చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్టును నిర్మించేశారు కాబట్టి జాతీయ హోదా ఇవ్వటం సాధ్యం కాదన్నారు.





నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వటం సాధ్యంకాదని కేసీయార్ తో పాటు అందరికీ తెలుసు. అయినా ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు హోదా ఇచ్చారు కాబట్టి తమ ప్రాజెక్టుకు కూడా జాతీయహోదా ఇచ్చి తీరాల్సిందే అంటు నానా గోల చేస్తున్నారు. విభజన చట్టం ప్రకారం జాతీయహోదా ఇచ్చిన పోలవరానికే కేంద్రం నిధులు ఇవ్వటంలేదు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏమిస్తుంది ? అనే సందేహాలు చాలానే ఉన్నాయి. అయినా కేసీయార్+టీఆర్ఎస్ ఎంపీలు పదే పదే డిమాండ్లు చేస్తున్నారు.





కేంద్రం తాజా ప్రకటనతో ఇక డిమాండ్లు చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. అసలు ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పంపుహౌస్ నిర్మాణంలో కూడా భారీఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎప్పటినుండో ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళ ఆరోపణలను టీఆర్ఎస్ నేతలు ఎప్పటికిప్పుడు తిప్పుకొడుతున్నారు. అయితే తాజాగా కురిసిన భారీ వర్షాలు, వరదల సందర్భంగా తలెత్తిన పరిణామాలు చూసిన తర్వాత కాంగ్రెస్, బీజేపీ నేతల అవినీతి ఆరోపణలు నిజమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: