ఎల్లోమీడియా వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. చంద్రబాబునాయుడికి ప్రయోజనం కలుగుతుందని అనుకుంటే అవతలి వ్యక్తితో ఒకరకంగా వ్యవహరిస్తుంది. అదే వ్యక్తివల్ల చంద్రబాబుకు నష్టం జరుగుతుందని అనుకుంటే చాలు వెంటనే బురదచల్లేయటం,  బ్లాక్ మెయిలింగుకు దిగటంతో పాటు  మైండ్ గేమ్ మొదలుపెట్టేస్తుంది. ఇపుడు జూనియర్ విషయంలో ఎల్లోమీడియా బ్లాక్ మెయిలింగుకు దిగినట్లే అనుమానంగా ఉంది. మొన్నటివరకు ఇదే జూనియర్ కు వైసీపీతో బాగా సన్నిహిత సంబంధాలున్నాయని గోలచేసింది.






ఈమధ్యనే అమిత్ షా తో జూనియర్ భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేయాలని జూనియర్ ను అమిత్ అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. అమిత్ కోరినట్లు ప్రచారం చేస్తారో లేదో తెలీదు కానీ వెంటనే జూనియర్ కు వ్యతిరేకంగా కథనాలు, విశ్లేషణలు మొదలైపోయాయి. తాత పెట్టిన పార్టీని కాదని జూనియర్ బీజేపీకి ప్రచారం చేస్తారా ? అని నిలదీస్తున్నది.  బీజేపీకి ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకోవటం ద్వారా కమ్మోరిని, టీడీపీని జూనియర్ దూరం చేసుకుంటారా అంటు ప్రశ్నిస్తున్నది. మంచి భవిష్యత్తున్న సినిమా ఫీల్డును కాదని జూనియర్ రాజకీయాల్లోకి వస్తారా ? అంటు గోల మొదలుపెట్టింది.





ఇక్కడ ఎల్లోమీడియా ఉద్దేశ్యం ఏమిటంటే జూనియర్ టీడీపీతో సహా ఎవరికీ ప్రచారం చేయకూడదు. కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమవ్వాలని కోరుకుంటున్నది. టీడీపీకి ప్రచారం చేస్తానంటే మళ్ళీ లోకేష్ కు ఇబ్బందులు మొదలవుతాయి. కాబట్టి టీడీపీలో యాక్టివ్ గా ఉండకూడదు. అలాగని ఇతర ఏ పార్టీతో కూడా కలవకూడదన్నది ఎల్లోమీడియా ఉద్దేశ్యం.





అంటే ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబుకు నష్టంచేసే ఎలాంటి నిర్ణయం కూడా జూనియర్ తీసుకోకూడదంతే. ఇదే జూనియర్ ను చంద్రబాబు కరివేపాకులాగ వాడుకుని పక్కనపెట్టేయచ్చు. మొత్తానికి అమిత్ తో జూనియర్ భేటీ అవ్వటం చంద్రబాబు, టీడీపీతో పాటు ఎల్లోమీడియాలో కూడా ఏ స్ధాయిలో టెన్షన్ పెరిగిపోతోందో అర్ధమైపోతోంది. మరి ఎల్లోమీడియా బ్లాక్ మెయిలింగ్, మైండ్ గేమ్ ను జూనియర్ ఎలా ఎదర్కొంటారన్నది ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: