ప్రస్తుతం అత్యవసర డాక్యుమెంట్‌ లలో ఒకటి పాన్ కార్డు..ఇన్కమ్ కు సంబందించిన టాక్స్ లను తగ్గించడానికి పాన్ ను వాడుతారు.బ్యాంకు ఖాతా తెరవాలన్నా, బ్యాంకు లావాదేవీలు జరపాలన్న పాన్‌ కార్డు తప్పనిసరి. పాన్‌కార్డు వల్ల ఆర్థిక విషయాలను పాన్‌కార్డు ద్వారా గుర్తిస్తుంది ఇన్‌కమ్‌ ట్యాక్‌ డిపార్ట్‌మెంట్‌.ఆర్థిక విషయాలను గుర్తించేందుకు పాన్‌కార్డును తప్పనిసరి చేసింది. అందుకే బ్యాంకు లావాదేవీలకు సంబంధించి విషయాలలో పాన్‌కార్డు తప్పనిసరి చేస్తున్నారు అధికారులు. ముఖ్యమైన డాక్యుమెంట్లలో పాన్‌కార్డు ఒకటి. అయితే ఆర్థిక మోసాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పాన్‌కార్డు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక పాన్‌కార్డు విషయంలో కొన్ని తప్పులు చేయడం వల్ల భారీగా జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుంటుంది. మరి ఎటువంటి తప్పులు చెయ్యకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము..


ఒక వ్యక్తి వద్ద ఒక పాన్‌కార్డు మాత్రమే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు ఉన్నట్లయితే జరిమానాతో పాటు కేసును ఎదుర్కొవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. కొందరు ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు కలిగి ఉంటారు. ఒకే అడ్రస్‌కు రెండు వేర్వేరు సమయాల్లో పాన్ కార్డులు రావడం, లేదా అడ్రస్ మారిన సమయాల్లో పాన్ కార్డులు రెండు చోట్లకు రావడం వల్ల ఇలా జరుగుతుంటుంది. ఒక వేళ ఒక వ్యక్తి రెండు పాన్‌కార్డులు ఉన్నా పెద్ద మొత్తంలో పెనాల్టీ చెల్లించుకోవాల్సి వస్తుంటుంది..జరిమానా తో పాటు కఠిన శిక్షలు కూడా తీసుకుంటారు.



మీ వద్ద ఉన్న రెండో పాన్‌కార్డును ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులకు సరెండర్‌ చేయాలి. ఒక దరఖాస్తు ఫారాన్ని నింపి పాన్‌కార్డును సరెండర్‌ చేయవచ్చు. ఇలా చేసినట్లయితే మీకు ఎలాంటి జరిమానా,శిక్ష పడదు.వివరాలు..


*.ముందుగా మీరు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలి.


*.అందులో రిక్వెస్ట్ ఫర్ న్యూ పాన్ కార్డ్ అండ్ ఛేంజెస్/కరెక్షన్ ఇన్ పాన్ డేటా అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
*. ఫారమ్‌ డౌన్‌లోడ్‌ చేసి అందులో వివరాలు నమోదు చేయాలి.
*. తర్వాత ఎన్‌ఎస్‌డీఎల్‌ కార్యాలయానికి వెళ్లి.. అక్కడ దానిని సబ్మిట్ చేయాలి.
*. అదే కార్యాలయంలో నింపిన ఫారంతో పాటు.. మీ దగ్గర ఉన్న రెండో పాన్ కార్డును సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: